E-Paper
Advertisement

RTC Bus Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు.. సీపీఎం మద్దతు.. చర్చలు జరపాలని ప్రభుత్వానికి డిమాండ్

RTC Bus Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు.. సీపీఎం మద్దతు.. చర్చలు జరపాలని ప్రభుత్వానికి డిమాండ్
Advertisement

RTC Bus Strike: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రావలసిన సుమారు రూ. 400 కోట్లతో పాటు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు. సంస్థను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలని కోరారు. అద్దె బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నడుపుతోందన్నారు.

Advertisement

ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వాటిని సంపూర్ణంగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి సూచించారు. ఏళ్ల తరబడి కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ నియామకాలను వెంటనే చేపట్టి కార్మికులపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలను జరపకపోవడం అంటే వారి హక్కులను కాలరాస్తూ, కార్మికుల గొంతు నొక్కడమే అని మండిపడ్డారు.

Also Read: మాయ మాటలు నమ్మెుద్దు.. సమ్మే ఆపేయండి.. సిబ్బందికి ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Advertisement

తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని జాన్ వెస్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 39 వేల మంది కార్మికులు రోడ్డున పడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. సాధారణ ప్రజలు, కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని అన్నారు. తద్వారా సమ్మె విరిమింపజేసేలా ప్రభుత్వం కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

Also Read: స్టార్ హీరోలు తమ కూతుర్లను ఇండస్ట్రీకి అందుకే పంపరా? షాకింగ్ విషయాలు చెప్పిన జేడీ!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×