E-Paper
Advertisement

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!
Advertisement

Army Arms Theft: స్వేచ్ఛ బ్యూరో: బొల్లారంలోని మద్రాస్​ ఆర్మీ రెజిమెంట్​ ఆయుధాల చోరీ కేసులో ఒక్కొక్కటిగా దిగ్భ్రాంతికర విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న హవల్దార్​ మల్లేశ్​ బంగ్లాదేశీయునికి అమ్మేందుకే ఆయుధాలను తస్కరించినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. సైన్యంలో చేరక ముందే మల్లేశ్ కు నేరచరిత్ర ఉన్నట్టుగా తెలిసింది. కోల్​ కతాలో పనిచేసిన సమయంలో అక్రమ ఆయుధాల వ్యాపారి నుంచి తపంచా కొన్న మల్లేశ్​ దారి దోపిడీలు చేయాలని కూడా ప్లాన్​ వేసినట్టుగా వెల్లడైంది. కోర్టు అనుమతితో పదిరోజులపాటు మల్లేశ్​ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆర్మీ అధికారులతో కలిసి జరిపిన విచారణలో ఈ వివరాలు వెలుగు చూశాయి.

2009లో..

Advertisement

నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆర్మీ హవల్దార్​ ఉప్పుతోళ్ల మల్లేశ్​ 2009లో ఆర్మీలో చేరాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే 2007లోనే ఆమ్రాబాద్​, అచ్చంపేట ప్రాంతాల్లో మల్లేశ్​ దొంగతనాలు చేయటం. సాధారణంగా ఆర్మీలో చేర్చుకోవటానికి ముందు అభ్యర్థికి ఏదైనా నేరచరిత్ర ఉందా? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తారు. దీనికోసం పోలీసు శాఖ సహాయాన్ని తీసుకుంటారు. అయితే, చోరీ కేసులు నమోదై ఉన్నా మల్లేశ్​ కు క్లీన్​ చిట్​ ఇవ్వటం..అతను ఆర్మీలో చేరటం జరిగిపోయాయి.

2022లో..

Advertisement

విధుల్లో భాగంగా మల్లేశ్​ 2022లో కోల్​ కతాలోని బ్యారక్​ పూర్​ కంటోన్మెంట్​ మిలటరీ బెటాలియన్​ లో విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలోనే బంగ్లాదేశ్​ నుంచి మన దేశంలోకి చొరబడి అక్రమంగా ఉంటూ కంటోన్మెంట్​ దగ్గరలో చెరుకు రసం దుకాణం నడుపుతున్న బీర్బల్​ షా అనే వ్యక్తితో మల్లేశ్ కు స్నేహం ఏర్పడింది. అతని ద్వారా అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్న అవల్​ దెయ్​ అలియాస్ ఓబీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మల్లేశ్​ అవల్​ దెయ్​ నుంచి ఓ నాటుతుపాకీని 10వేల రూపాయలకు కొన్నాడు. దాంతో దారి దోపిడీలు చేయాలని ప్లాన్​ చేశాడు. అయితే, దోపిడీలు చేయటానికి వీలు పడలేదు. దాంతో కొన్న తపంచాను స్వగ్రామంలోని తన ఇంట్లో దాచి పెట్టాడు.

2025లలో..

2‌‌025, జూన్​ లో మల్లేశ్​ బొల్లారంలోని మద్రాస్​ రెజిమెంట్​ 20వ బెటాలియన్​ కు బదిలీపై వచ్చాడు. ఆ తరువాత కొన్నిరోజులకే భార్యాపిల్లలను హైదరాబాద్​ తీసుకొచ్చాడు. నెలకు 12వేల రూపాయల అద్దెకు యాప్రాల్ లో ఓ ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నాడు.

అధికారులపై కక్షతో..

విధుల నిర్వర్తనలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటంతో ఆర్మీ అధికారులు మరో మూడు సంవత్సరాల సర్వీస్​ ఉండగానే మల్లేశ్​ ను రిటైర్​ చేయించారు. దాంతో మల్లేశ్ వాటిపై కక్ష పెంచుకున్నాడు.

డబ్బు చాలక..

ఇక, రిటైర్మెంట్ బెనిఫిట్స్​ తో మల్లేశ్​ నాగర్​ కర్నూల్​ టౌన్​ శ్రీపురం లో ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాడు. అదే సమయంలో 8లక్షల రూపాయలు వెచ్చించి నాగర్ కర్నూల్​ లో ఓ ప్లాట్​ కొన్నాడు. దాంతో రిటైర్​మెంట్ బెనిఫిట్స్​ గా వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు కావటంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.

ఆయుధాల చోరీకి కుట్ర..

ఈ నేపథ్యంలోనే తాను పని చేసిన బొల్లారం మద్రాస్ రెజిమెంట్ నుంచి ఆయుధాలను చోరీ చేయాలని మల్లేశ్​ కుట్ర చేశాడు. దీని కోసం బ్యాంకుల్లో జరిగిన దోపిడీలు..దొంగతనాలకు సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్​ లో చూడటంతోపాటు క్రైం వెబ్ సిరీస్​ లు చూశాడు. ఆ తరువాత తన స్వగ్రామంలో ఉంటున్న చిన్ననాటి స్నేహితులు నిరంజన్​, మల్లికార్జున్​ లను సంప్రదించాడు. వారికి బ్యాంకులు, బంగారు దుకాణాల్లో జరిగిన చోరీలు..దోపిడీలకు సంబంధించిన వీడియోలను కూడా పంపించాడు. ఒక్కసారి దొంగతనం చేస్తే లైఫ్​ లో సెటిల్​ అయిపోవచ్చని చెప్పాడు. అయితే, ఆర్మీ రెజిమెంట్​ నుంచి ఆయుధాలను తస్కరించే ధైర్యం చేయలేకపోయిన నిరంజన్​, మల్లికార్జున్​ లు దీనికి నిరాకరించారు.

వ్యూహం మార్చుకుని..

దాంతో మల్లేశ్​ తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. గత జూలైలో మద్రాస్​ రెజిమెంట్​ లో పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. అంతకు ముందే ఇదే రెఙిమెంట్​ లో పనిచేసినవాడు కావటంతో లోపలికి వెళ్లటానికి అతనికి ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు.

మరో ఇద్దరు ఉద్యోగులతో..

మద్రాస్​ రెజిమెంట్ లో పని చేస్తున్న తన పాత స్నేహితుడు శేషుతో కలిసి కొత్తగా మరో కుట్ర చేశాడు. అదే సమయంలో ఆయుధాల చోరీకి తన బ్యాచ్​ మేట్​ అయిన ప్రవీణ్​ సహకారం తీసుకున్నాడు. మల్లేశ్​ కు సహకరించటానికి ఒప్పుకొన్న శేషు రెజిమెంట్ లోని ఆయుధాగారం వద్ద విధుల్లో ఉండే వినోద్ ను కుట్రలో భాగస్వామిని చేశాడు.

వారం ముందే..

పకడ్భంధీగా చేసిన కుట్ర ప్రకారం చోరీకి వారం రోజుల ముందే శేషు, వినోద్​ లు ఆయుధాగారం వద్ద ఉన్న సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారు. ఇక, ఆయుధాలను అపహరించినపుడు దాదాపు గంటన్నరపాటు విద్యుత్​ దీపాలు వెలగకుండా శేషు, ప్రవీణ్​ చూసుకున్నారు. అటువైపుగా వచ్చిన ఆర్మీ జవాన్లను డైర్ట్​ కూడా చేశారు. ఇక, దొంగతనం జరిగిన రోజున వినోద్​ ఆయుధాగారం వద్ద డ్యూటీలో ఉండటంతో మల్లేశ్​ పని సులువైంది. చోరీకి సహకరించినందుకు మల్లేశ్​ లక్ష రూపాయలను సికింద్రాబాద్​ ఫుట్​ బాల్​ గ్రౌండ్​ వద్ద వినోద్​ కు ఇచ్చాడు.

హోండా యాక్టీవా..

ఇక, తస్కరించిన ఆయుధాలు, బుల్లెట్లు, నైట్​ విజన్ బైనాక్యులర్లను మొదట మల్లేశ్​ తన హోండా యాక్టీవా స్కూటర్​ ద్వారా యాప్రాల్ లోని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత బ్రెజా కారులో వాటిని నాగర్​ కర్నూల్​ లోని తన ఇంటికి చేర్చి దాచిపెట్టాడు.

బంగ్లాదేశీతో డీల్..

కోల్​ కతాలో పని చేసినపుడు తనకు పరిచయం అయిన బంగ్లాదేశీయుడు బీర్బల్​ షాను సంప్రదించాడు. అతని ద్వారా అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్న అవల్​ దెయ్​ కు ఆయుధాలు అమ్మేందుకు ప్లాన్​ చేశాడు. ఈ క్రమంలో 5లక్షల రూపాయలకు 4ఏకే 47 తుపాకులు, 3లక్షలకు పిస్టళ్లు అమ్మటానికి బీర్బల్​ షాతో డీల్​ కూడా కుదుర్చుకున్నాడు.

పక్కాగా ఆధారాలు సేకరించి..

అయితే, ఆయుధాల చోరీ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించటంతో మల్కాజిగిరి ఎస్వోటీ, హైదరాబాద్ టాస్క్​ ఫోర్స్​ సిబ్బంది రంగంలోకి దిగారు. అదే సమయంలో ఆర్మీ ఇంటెలిజెన్స్​ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో 8.50లక్షల మొబైల్​ ఫోన్ల నెంబర్లు సేకరించి వాటిని జల్లెడ పట్టారు. చివరకు మల్లేశ్​ దొంగతనానికి పాల్పడ్డట్టు నిర్ధారించుకుని అరెస్ట్​ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని 10రోజులపాటు విచారణ చేయగా ఈ దిగ్ర్భాంతికర విషయాలు వెలుగు చూశాయి.

ఆ ఇద్దరి కోసం వేట..

ప్రస్తుతం ఈ కేసులో బీర్బల్ షా, అవల్​ దెయ్​ ల కోసం పోలీసులు వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు కోల్​ కతా చేరుకున్నట్టు సమాచారం. బీర్బల్ షా బంగ్లాదేశీయుడు కావటం..అవల్​ దెయ్​ అక్రమ ఆయుధాల దందా చేస్తున్న నేపథ్యంలో వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఇద్దరు చేతికి చిక్కితే మొత్తం నెట్​ వర్క్​ విషయాలు బయటపడతాయని చెబుతున్నారు.

Also Read: టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Tags

Related News

ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

గాంధీ జయంతి వేళ KCR సంచలన కామెంట్స్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్!

మియాపూర్ అపార్ట్‌మెంట్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి!

కేసీఆర్‌ని తిట్టడం కాదు.. పాలనసై దృష్టి పెట్టు రేవంత్!- చింత ప్రభాకర్

దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంపై దాడి.. నిందితుడు అదుపులోకి!

కొడంగల్‌లో కాదు.. ధైర్యముంటే ముందు సిరిసిల్లలో గెలువు! కేటీఆర్‌కు ఐలయ్య ఓపెన్ ఛాలెంజ్

Big Stories

Advertisement
×