BigTV English

Cases on Ex CM’s: మాజీ సీఎంల చుట్టూ కేసులు.. జగన్, కేసీఆర్ ను వెంటాడుతున్న..

Cases on Ex CM’s: మాజీ సీఎంల చుట్టూ కేసులు.. జగన్, కేసీఆర్ ను వెంటాడుతున్న..

Cases Filing on Ex CM’s Jagan and KCR: ఏపీ, తెలంగాణ రాజకీయాలలో పలు కీలక మార్పులు జరగనున్నాయి. నాడు అధికారంలో ఉన్న సీఎంల చుట్టూ పలు కేసులు చుట్టుముట్టుకోనున్నాయి. నాడు అధికారంలో ఉన్నాం కదా.. ఏం చేసినా చెల్లుతుందనే భావనతో జగన్, కేసీఆర్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందాన తప్పులు చేసుకుంటూ వెళ్లారు. నాడు నియంతృత్వ ధోరణితో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు కేసుల రూపంలో శాపాలై చుట్టుకుంటున్నాయి. శాసన సభలో ప్రతిపక్ష నేతలను అంచనా వేయడంలో ఈ ఇద్దరూ ఫెయిలయ్యారు. ఎవరినైతే తక్కువ అంచనా వేసి తిరిగి వాళ్లు అధికారంలోకి రావడం కల్ల అని భావించారో వాళ్లే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి ఈ మాజీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.


జగన్ పై కేసు నమోదు

వైఎస్ జగన్ మొదట్లో సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టినప్పటికీ రానురానూ అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు బనాయించి వాళ్లను సంఘ విద్రోహశక్తులుగా చూపించారు.మరి అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు ఊరుకుంటారా? మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఆయనపై రాజద్రోహం బనాయించింది. ఇక పోలీస్ స్టేషన్ లో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రఘురామ కృష్ణంరాజు తనపై జగన్ హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆయనకు సహకరించిన పోలీు బాసులపైనా కేసులు పెట్టారు. ఇది బిగినింగ్ మాత్రమే. చంద్రబాబును జైలుకు పంపి చాలా పెద్ద తప్పే చేశారు జగన్. ఇప్పటికే అధికార పక్ష హోదాలో చంద్రబాబు అన్ని శాఖల అధికారులకు ఎక్కడెక్కడ ఎలా స్కాములు జరిగాయి అనేదానిపపై కసరత్తు ప్రారంభించారు. ఈ నివేదికల ఆధారంగా జగన్ సర్కార్ పై మరిన్ని కేసులు చుట్టుకోనున్నాయి.


Also Read: Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

కేసీఆర్ ను వెంటాడుతున్న కేసులు

ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక నియంతృత్వ ధోరణి బాగా పెరిగిపోయింది. నాడు కేసీఆర్ అనుసరిస్తున్న పోకడలను బాహాటంగా ఎండగట్టడంలో అప్పటి కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి సఫలం అయ్యారు. తాను చేసే ప్రతి పనికి ఆటంకం కలిగిస్తున్నాడే నెపంతో రేవంత్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. చివరకు తన కూతురు పెళ్లికి కూడా రేవంత్ ముద్దాయిగానే వెళ్లవలసి వచ్చింది. నాడు చాలా తక్కువ అంచనా వేసిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ సీఎంగా చక్రం తిప్పుతున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు, వాగ్దానాలు నెరవేరుస్తూనే కేసీఆర్ హయాంలో జరిగిన భూ స్కాములు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కట్టడం అక్రమాలు, ఛత్తీస్ గఢ్ నుంచి పవర్ కొనుగోళ్లలో అవకతవకలు తదితర అంశాలపై దృష్టి సారించారు.వీటిపై ఏ క్షణానైన కేసీఆర్ పై కేసులు నమోదవ్వవచ్చు. ఇప్పటికే ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలు పార్ట మారకుండా వాళ్లను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందేమో ననే టెన్షన్ తో ఉన్నారు. అలాగే జగన్ కు ప్రస్తుతం ఎలాగూ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఉంటారో లేదో అర్థం కాని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా వ్యవహరించిన ఈ నేతల చుట్టూ ఇప్పుడు కేసులు తిరుగుతున్నాయి.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×