BigTV English

Medaram Jathara: మేడారం వనదేవతల జాతర.. పోటేత్తిన భక్తులు..

Medaram Jathara: మేడారం వనదేవతల జాతర.. పోటేత్తిన భక్తులు..

Medaram jatara live updates(Local news telangana): తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్టమైన గిరిజన వనదేవతల జాతర.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర వైభవంగా సాగుతుంది. సమ్మక సారలమ్మ జతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం రూ. 75 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. నిధులు రావడంతో వనదేవతల జాతర ఏర్పాట్లను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు.


మేడారం మహాజాతర ఫిబ్రవరి 21న ప్రారంభంకానుంది. ఇప్పటికే నిత్యం వేల మంది సమ్మక్క సారలమ్మను దర్శినానికి తరలివస్తున్నారు. వనదేవతలైన సమక్క, సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సమక్క సారలమ్మకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు. దీంతో వన పరిసర ప్రాంతాలంతా భక్తులతో రద్దీగా మారాయి.

పైగా ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా మేడారం పరిసర ప్రాంతాలంతా సందడిగా మారాయి. మేడారం వెళ్లే భక్తులు మొదట గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. మేడారం వెళ్లే భక్తులతో ములుగు గట్టమ్మ దేవాలయం కిటకిటలాడుతుంది. భక్తులు సమ్మక్క, సారలమ్మలకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర సమీపిస్తున్న వేళ రోజురోజుకు రద్దీ పెరుగుతోంది.


భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యలను కల్పించారు. 24గంటలు అందుబాటులో ఉంటూ జనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×