BigTV English

Number Plates : నంబర్ ప్లేట్స్ ఎందుకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి..?

Number Plates : నంబర్ ప్లేట్స్ ఎందుకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి..?

Number Plates : ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ అనేది తప్పనిసరి. నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే అది చట్టానికి విరుద్ధం. పోలీసులు కూడా భారీ జరిమానా విధిస్తారు. నంబర్ ప్లేట్ ఉంటే వాహనాన్ని గుర్తించడం సులభం. వాహనాలకు ఉండే నంబర్ ప్లేట్లను గమనిస్తే అవి వివిధ రంగుల్లో భిన్నంగా ఉంటాయి. కారు, బైక్.. ఇలా ప్రతి వాహనానికి ఉండే నంబర్ ప్లేట్ ఒక్కో రంగులో ఉంటుంది. ఈ నెంబర్ ప్లేట్లు రకరకాల రంగుల్లో ఎందుకు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.


వైట్ కలర్ నంబర్ ప్లేట్

ఈ నంబర్ ప్లేట్‌ వైట్ కలర్‌లో ఉంటుంది. ప్లేట్‌పై లెటర్స్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఈ కలర్ నంబర్ ప్లేట్ ఉంటే.. ఆ వాహనం సాధారణ ప్రజలకు సంబంధించినది. వీటిని పర్సనల్‌గా ఉపయోగించే బైక్‌లు లేదా కార్లకు రవాణాశాఖ కేటాయిస్తుంది.


ఎల్లో కలర్ నంబర్ ప్లేట్

ఈ నంబర్ ప్లేట్ ఎల్లో కలర్‌లో ఉంటుంది. ప్లేట్‌పై అక్షరాలు బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్లు ఎక్కువగా ట్యాక్సీలు, కార్లు, బస్సులు, లారీలకు ఉంటాయి. ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను అద్దెకు ఇవ్వొచ్చు. సరుకులు, ప్రయాణికుల రవాణాకు వీటిని ఉపయోగిస్తారు. ఇవి పూర్తిగా కమర్షియల్.

గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్

ఇటీవల ఈ నంబర్ ప్లేట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ నంబర్ ప్లేట్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అక్షరాలు వైట్ కలర్‌లో కనిపిస్తాయి. వీటని ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఉపయోగిస్తారు.

బ్లూ కలర్ నంబర్ ప్లేట్

ఈ నంబర్ ప్లేట్ బ్లూ కలర్‌లో ఉంటుంది. ప్లేట్‌పై అక్షరాలు వైట్ కలర్‌లో ఉంటాయి. విదేశాలకు చెందిన డిప్లోమేట్స్, ఎఫ్‌బీఐ, ఎన్ఐఏ లాంటి వాహనాలకు మాత్రమే ఈ నంబర్ ప్లేట్లు ఉంటాయి. ఇటువంటి వాహనాలకు సదరు దౌత్యవేత్తకు చెందిన దేశం కోడ్ ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్లలో ప్రధానంగా మూడు కోడ్‌లు ఉంటాయి.

కాన్సులర్ కార్ఫ్స్ (CC)
యునైటెడ్ నేషన్స్ (UN)
కార్ప్స్ డిప్లొమాటిక్ (CD)

రెడ్ కలర్ నంబర్ ప్లేట్

ఈ నంబర్ ప్లేట్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ప్లేట్‌పై అక్షరాలు వైట్ కలర్‌లో ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను టెంపరరీ రిజిస్ట్రేషన్ అయిందని అర్థం. ఇవి ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉంటాయి. పర్మినెంట్ వచ్చాక దీనిని తీసేస్తారు.

పైకి యారో సింబల్ ఉన్న నంబర్ ప్లేట్

ఈ నంబర్ ప్లేట్లను మిలటరీ అవసరాలకు పనిచేసే వాహనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ నంబర్ ప్లేట్ రక్షణ శాఖ పేరు మీద రిజిస్టరై ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్‌‌పై ముందు లేదా చివరిలో బాణం గుర్తు పైకి ఉంటుంది. ఆర్మీతో పాటు నేవీ వారికి ఈ నంబర్ ప్లేట్లు ఉంటాయి. ఈ వాహనాలను బ్రాడ్ ఏరో వెహికల్స్ అంటారు.

రెడ్ కలర్ నంబర్ ప్లేట్ పై జాతీయ చిహ్నం

ఈ రెడ్ ప్లేట్‌పై ఎలాంటి నంబర్ ఉండదు. ప్లేట్‌పై కేవలం మూడు సింహాల జాతీయ చిహ్నం ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రాష్ట్రపతి, గవర్నర్లు మాత్రమే ఉపయోగిస్తారు. జాతీయ చిహ్నం బంగారు రంగులో ఉన్నట్లయితే అది రాష్ట్రపతికి చెందిన వాహనం.

బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్

ఈ నంబర్ ప్లేట్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ప్లేట్‌పై అక్షరాలు నలుపు రంగులో ఉంటాయి. ఈ ప్లేట్లను లగ్జరీ హోటల్ వాహనాలకు ఉపయోగిస్తారు. ఈ వాహనాల డ్రైవర్స్‌కు ఎటువంటి లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

భారత్ సీరిస్

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రిజిస్ట్రేషన్ కోడ్ ఉంటుంది. కానీ BH(భారత్) అనే సిరీస్ ఉన్న వాహనాలను తక్కువగా చూసుంటాము. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు, మూడు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ ఆఫీస్ కార్యాలయాలు ఉన్న కార్పొరేట్ ఉద్యోగులకు BH(భారత్) సిరీస్ ఉన్న నంబర్ ప్లేట్లు ఉంటాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×