Indian Jawan Died: LOC వెంబడి పాక్ పిచ్చి చేష్టలకు పాల్పడుతోంది. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ కాల్పులకు తెగబడింది. నియంత్రణ రేఖ దగ్గర పాకిస్థాన్ ముష్కరులు కాల్పులు జరిపారు. అయితే పాకిస్థాన్ దాడులపై బీఎస్ఎఫ్ తీవ్రంగా స్పందించింది. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే పాక్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని BSF వర్గాలు తెలిపాయి.
ఆపరేషన్ సిందూర్‌లో మరో జవాన్ మృతి చెందారు. సరిహద్దుల్లో భరతమాత రక్షణ కోసం పోరాడుతూ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) అనే సోల్జర్ నేలకొరిగాడు. మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామం ఈరోజు జన్మించినమురళీనాయక్.. తానుజవాను కావాలన్నది చిన్నప్పటి కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. చివరకు అనుకున్నది సాధించి.. సరిహద్దులో మంచుకొండల్లో దేశ రక్షణలో భాగమయ్యాడు. కాగా ఈరోజు స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహం చేరుకోనుంది.
ఇదిలా ఉంటే.. భారత్‌ను పాకిస్థాన్ రెచ్చగొడుతోంది. మిస్సైల్స్ , డ్రోన్లతో యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో..ఇవాళ పాకిస్థాన్..తెల్లవారుజామున శ్రీనగర్‌లో పాక్ దాడులకు దిగింది. దీంతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. మరోసారి ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మరోసారి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో 2 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
Also Read: 1947 To 2025.. పాక్‌తో భారత యుద్ధాలు
అవంతిపురం సమీపంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించామన్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్ విమానాశ్రయంపై.. ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా.. సైన్యం వాటిని తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ వరుస దాడులకు పాల్పడుతుండడంతో శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు సైరన్లు మోగించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, బాల్కనీల్లో ఉండకుండా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు. పంజాబ్‌లోని బఠిండాలో అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పేలుళ్లు సంభవిస్తుండడంతో దానితో సహా ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను ఈనెల 15 వరకు మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది