Sreesanth- Sanju: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కి చోటు కల్పించకపోవడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వైట్ బాల్ క్రికెట్ లో సంజూ శాంసన్ రీసెంట్ ఫామ్ చూస్తే.. అతడిని కచ్చితంగా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సంజూని సెలెక్ట్ చేయకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. కేరళ క్రికెట్ అసోసియేషన్ {కే.సి.ఏ} క్యాంప్ కి హాజరుకానందున విజయ్ హజారే కేరళ జట్టు నుంచి సంజూ శాంసన్ ని పక్కన పెట్టారు.
Also Read: Rashid Khan: 1000 వికెట్లు తీస్తా.. ఇదే నా సీక్రెట్ !
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కేరళ క్రికెట్ బోర్డు అతనిపై వేటు వేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో చోటు కోల్పోవడమే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి కూడా దూరమయ్యాడు సంజూ. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కి ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో అవకాశం కోల్పోవడంపై తాజాగా స్పందించారు భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్. విజయ్ హజారే ట్రోఫీకి కేరళ క్రికెట్ అసోసియేషన్ సంజు శాంసన్ ని సెలెక్ట్ చేయకపోవడం కారణంగానే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కలేదని శ్రీశాంత్ ఆరోపించారు.
ఇలా శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కేరళ క్రికెట్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశాంత్ కి నోటీసులు కూడా జారీ చేసింది. ” శ్రీశాంత్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన సమయంలో కే.సి.ఏ అధికారులు అతనికి మద్దతుగా నిలిచారు. అప్పుడు క్రిమినల్ కేసును క్వాష్ చేయడంతో ఫిక్సింగ్ కేసు నుంచి అతడు బయటపడ్డాడు. ఆ సమయంలో మేము అతడికి సహాయం అందించాం. కాబట్టి ఇతర ప్లేయర్ల సంరక్షణ విషయం శ్రీశాంత్ కి అవసరం లేదు” అని కే.సి.ఏ ఓ ప్రకటనలో తెలిపింది.
దీంతో కేసిఏ వ్యాఖ్యలపై స్పందించాడు శ్రీకాంత్. ” భారత జట్టుకు ఆడాలనే ప్రతి క్రికెటర్ కలకు నేను మద్దతుగా నిలుస్తా. అంతేకానీ వారిని అనగదొక్కే వారితో ఎప్పటికీ కలిసి ఉండను. న్యాయం, ధర్మంపై నాకు నమ్మకం ఉంది. కేరళ క్రికెట్ సంగం ప్రభావంతో కీలకమైన అంశంపై చర్చ జరగదేమోనని ఆందోళన నాకు ఉంది. ఎవరైతే నా పరువుకు భంగం కలిగేలా ప్రెస్ స్టేట్మెంట్ ని విడుదల చేశారో.. వారి త్వరలోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికీ నేను ప్లేయర్లకు మద్దతుగా మాట్లాడుతూనే ఉంటా” అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.
2005లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన శ్రీశాంత్.. తన కెరీర్ లో 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి-20 మ్యాచ్ లు ఆడాడు. వీటిలో మొత్తం 169 వికెట్లు పడగొట్టాడు. అయితే 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో స్పాట్ ఫిక్సింగ్ తో శ్రీశాంత్ జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆ శిక్ష ఏడేళ్లకు తగ్గించగా.. 2020 సెప్టెంబర్ నాటికి నిషేధం పూర్తి చేసుకున్నాడు. అనంతరం జాతీయ జట్టులోకి రావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
Also Read: Shubman Gill: అమ్మాయిలతో గిల్ సెల్పీలు… కుళ్లుకుంటున్న సారా ?
చివరకు 2022లో అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇక క్రికెట్ మైదానంలో బ్యాటర్లను బంతితో గడగడలాడించిన శ్రీశాంత్ అనంతరం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రెండు మూడు సినిమాలలో నటించినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలిసారి అక్సర్ 2 అనే హిందీ మూవీ లో నటించాడు. ఆ తరువాత మలయాళ మూవీ టీమ్ 5, ఆ తరువాత మరో హిందీ చిత్రం క్యాబారేట్ సినిమాలో చోటా డాన్ అనే పాత్రలో కనిపించాడు. అనంతరం కంపె గౌడ 2 చిత్రంలో ఆకట్టుకున్నాడు.