Ben Stokes : సాధారణంగా క్రికెట్ లో భారత జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యుర్థులు ఎవ్వరైనా సరే వెన్నులో వణుకు పడుతుంది. భారత జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో కూడా బలంగానే ఉంది. గత కొద్ది సంవత్సరాల నుంచి టీమిండియా ఆల్ రౌండ్ షో నిర్వహిస్తుంది. అలాగే టీమిండియాలో ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఆడిన ప్రతీ చోట అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అందుకే భారత జట్టుతో పెట్టుకోవాలంటే ఏ జట్టు అయినా భయపడే పరిస్తితి నెలకొంది. భారత్ తో మ్యాచ్ కోసం సరికొత్త వ్యూహాలతో సన్నద్ధమవుతుంటారు అపోజిషన్ టీమ్స్. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అదే పనుల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్, కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ స్ట్రాటజీ ప్లానింగ్ లో మునిగిపోయాడనే చెప్పాలి.
Also Read : Shahid Afridi : ఆర్మీ అధికారికి అఫ్రిది ముద్దులు… వాడో హిజ్రా అంటూ ట్రోలింగ్
అంతేకాదు.. ఆయన భారత సిరీస్ నేపథ్యంలో ఏకంగా మందు కూడా మానేశాడు. ఐపీఎల్ పూర్తికాగానే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఉంది. అయితే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజాగా మద్యం మానేసినట్టు ప్రకటించేశాడు. టీమిండియాతో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ లో తలపడనుంది ఇంగ్లాండ్ జట్టు. ఈ నేపథ్యంలో కాస్త ఫిట్ గా ఉండేందుకు ఆల్కహాల్ తీసుకోవడమే ఆపేశాడు స్టోక్స్. వాస్తవానికి గాయం కారణంగా గత 6 నెలలుగా ప్రొఫెషనల్ క్రికెట్ కి దూరంగానే ఉంటున్నాడు. జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ లో పునరాగమనం చేయనున్నాడు. మే 22 నుంచి జింబాబ్వేతో తలపడనుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే స్టోక్స్ చూపు మాత్రం టీమిండియాతో జరిగే 5 టెస్ట్ ల సిరీస్ మీదే నెలకొంది. డబ్ల్యూటీసీ నయా సైకిల్ లో జరిగే తొలి సిరీస్ కావడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది ఇంగ్లాండ్ జట్టు. దీనికి తోడు సీనియర్లు లేకపోయినా డేంజరస్ గేమ్ తో భయపెట్టే కుర్రాళ్లు టీమ్ నిండా ఉండటంతో భారత్ ను తక్కువ అంచనా వేసేందుకు లేదు.
Also Read : Telugu Commentators: 14 ఏళ్ళ కుర్రాడిని ర్యాగింగ్ చేసిన విహారి.. తెలుగు కామెంట్రీపై బ్యాన్ !
అందుకోసమే ముందస్తుగా మందు మానేసి ఫిట్ నెస్ పెంచుకోవడం.. జూన్ రెండో వారం వరకు పూర్తి సంసిద్ధతతో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడు స్టోక్స్. భారత్ తో తలపడే టెస్ట్ సిరీస్ కోసం తాత్కాలికంగా మద్యం మానేస్తున్నట్టు తెలిపాడు స్టోక్స్. అంతేకాదు.. ఆల్కహాల్ ను పూర్తి పక్కకు పెట్టడం లేదని స్పష్టం చేశాడు. టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వడం.. తన శక్తి మేరకు రాణించడం కోసం కొన్నాళ్లు మందును పక్కన పెడుతున్నట్టు తెలిపాడు. గాయాలతో నిత్యం సావాసం చేసే స్టోక్స్.. 2022 వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇంజ్యూరీల వల్ల టీ-20లకు అతను దూరంగా ఉంటున్నాడు ఇంగ్లండ్ సారథి.