Tata Madhu Row: తాతా మధు కామెంట్ల చుట్టూనే అసెంబ్లీ దుమారం నడుస్తోంది. చివరకు SC/ST చట్టం కింద కేసు, వేటు చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ బయట పోలీసులతో ఘర్షణ వ్యవహారంలో పోటా పోటీగా కంప్లైంట్లు, కేసులు నడుస్తున్నాయ్. తాతా మధు తాను స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పడంతో పాటు.. విచారం వ్యక్తం చేశారు. అనేది అని విచారం అంటే కుదురుతుందా అన్నది కాంగ్రెస్ ప్రశ్న. హరీష్‌రావు మాత్రం తమ ఎమ్మెల్యేలపై పోలీసుల వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించారంటున్నారు. మరోవైపు అధికార పక్షం మాత్రం స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాల్సిందే అంటోంది. ఇరువైపులా ఆరోపణలు, ఆవేశాలు పెరుగుతున్న వేళ.. సభలో చర్చించాల్సిన అసలు ప్రజా సమస్యలు మాత్రం పక్కదారి పడుతున్నాయా?