ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి. కనిష్టంగా 2 కి.మీ లకు రూ.10, గరిష్టంగా 26 కి.మీ లకు రూ.60 ఛార్జీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పెంచనున్న ఛార్జీలతో దాదాపు 5 లక్షల పైన ప్రయాణికులకు భారం పడనుంది. అయితే సంస్థ ఛార్జీలపై ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషస్తున్నప్పటకీ.. ఏ మార్గాన కూడా ఆశించినంత ఆదాయం రావడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్ ను తగ్గించేందుకు ఛార్జీల పెంపు తప్పనిసరి అధికారులు చెబుతున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ మెరుగు పరిచేందుకు కఠిన నిర్ణయాలు తప్పడం లేదని సంస్థ ప్రకటించింది.
కర్నాటక రాజధాని బెంగళూరు లో ఇటీవల మెట్రో టిక్కెట్ ఛార్జీలు పెంచారు. అక్కడ 44 శాతం ఛార్జీలను పెంచారు. 25 కి.మీ దాటితే గరిష్టంగా రూ.90 వరకు ఛార్జీలు పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో ఛార్జీలను 2017లో పెంచారు. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ లో కూడా మెట్రో టికెట్ ఛార్జీలు భారీగానే పెంచనున్నట్లు తెలుస్తోంది. కనీసం 30 నుంచి 40 శాతం వరకు టిక్కెట్ రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల కలిగే నష్టాల కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలో ఎల్అండ్ టీ ప్రెసిడెంట్, డైరెక్టర్, సీఎఫ్ఓ శంకర్ రామన్ అన్నారు. ఈ పథకం కొనసాగితే 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో నుండి వైదొలుగుతామని తెలిపారు. దీంతో మెట్రో నష్టాల కారణంగా తాము మహాలక్ష్మి పథకాన్ని ఆపలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అవసరమైతే ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ నుంచి వారికి నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రిటైల్ స్థలాలు అలాగే ప్రకటనల వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, మెట్రో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం ఛార్జీలను పెంచడం అవసరమని అధికారులు భావిస్తున్నారు. మెట్రో టికెట్ ఛార్జీల పెంపుపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులపై ప్రభావం చూపే అఫీషియల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
ALSO READ: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?