CM Revanth Reddy: జాతీయ క్రీడలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ చేశారు. మరో రెండేళ్లలో జాతీయ క్రీడలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో బెస్ట్ స్పోర్ట్స్ పాలనీని ప్రభుత్వం రెడీ చేయనుంది.
లేటెస్ట్‌గా మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ పెండ్యాల హరికృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ తాను గెలుచుకున్న మెడల్‌ను చూపించారు. పోటీల సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో కాసేపు ముచ్చటించారు. ఆటగాళ్లు- ముఖ్యమంత్రి మధ్య స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి చిన్నపాటి చర్చ జరిగినట్టు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ పెండ్యాల హరికృష్ణ@HariChess @revanth_anumula#Hyderabad #IndianChessGrandMaster #PendyalaHariKrishna #BigTV pic.twitter.com/lssIyA0zB9
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2024
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన స్టార్ షట్లర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత కిదాండి శ్రీకాంత్@revanth_anumula @srikidambi #Hyderabad #KidambiSrikanth #RevanthReddy #BigTV pic.twitter.com/xbjCfUIxJA
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2024