E-Paper
Advertisement

బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!

బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!
Advertisement

Bandi Sanjay: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వినూత్న కార్యక్రమానికి సిద్ధమయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ‘స్వచ్చ పాఠశాల’ పేరుతో పరిశుభ్రం చేయాలని సంకల్పించారు. 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అన్ని గ్రామాల్లో గల ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటిన్నీ క్లీన్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 13న ఆయా పాఠశాలలన్నింటినీ పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ లోని చైతన్యపురిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు. మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ పరిశుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గంలో బుధవారం (ఈనెల 10న) మండలాల వారీగా పార్టీ కార్యకర్తలంతా సమావేశమై ఒక్కో పాఠశాల వారీగా ఇంచార్జీలను నియమించాలని సూచించారు.

Advertisement

ఈనెల 11, 12 తేదీల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో టిఫిన్ బైఠక్ పేరుతో సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి స్కూల్ లోని ఎన్ని తరగతి గదులుంటాయో, ఒక్కో గదికి ఇద్దరు చొప్పున కార్యకర్తలను కేటాయించాలని సూచించారు. ఈ నెల 13న అన్ని పాఠశాలల్లోని అన్ని తరగతి గదులను శుభ్రం చేయించాలన్నారు. అవసరమైతే చీపురు, క్లాత్ వంటి వస్తువులను తీసుకెళ్లాలన్నారు. క్లాస్ రూంలను శుభ్రం చేయడంతోపాటు ఆయా పాఠశాలలను సుందరంగా ముస్తాబు చేయాలని స్పష్టం చేశారు.

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రాం వంటి సోషల్ మీడియా ద్వారా ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని బండి సంజయ్ కోరారు. దీంతోపాటు ఈనెల ప్రతి గ్రామంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించండి అనే నినాదంతో ఊరూవాడా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనిపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ ను అందజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Advertisement

Also Read: ఫ్రిజ్ కొంటున్నారా? సింగిల్ డోర్, డబుల్ డోర్, ఇన్వర్టర్ టెక్నాలజీలలో ఏది బెస్ట్?

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రికార్డు స్థాయిలో ఒకేసారి ఒకే టైంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులందరికీ సైకిళ్లను పంపిణీ చేద్దామని, అవసరమైతే గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేద్దామన్నారు. ఇదిలా ఉంటే 12 ఏళ్ల మోదీ పాలనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఉదయం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Also Read: రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×