E-Paper
Advertisement

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!
Advertisement

Ramchander Rao: స్వేచ్చ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులను కేటాయిస్తోందని, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానల్లో అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది జీతాల వరకు మెజారిటీ నిధులను కేంద్రమే అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్ లో బీజేపీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ధన్వంతరి అవార్డుల మహోత్సవానికి రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, రోగికి చేసే వైద్యం ఒక వ్యక్తికే కాకుండా సమాజానికి, దేశానికి చేసే సేవగా భావించాలని ఆయన పేర్కొన్నారు.

స్వదేశీ వ్యాక్సిన్..

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ భావంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఆరోగ్య రంగానికి ప్రధాని మోడీ ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రధాని మోడీ అందించిన ప్రోత్సాహమే కారణమని కొనియాడారు. స్వచ్ఛ భారత్ పరిసరాల పరిశుభ్రతకే కాక స్వస్థ్ భారత్ సాధనకు పునాదిగా నిలిచిందని తెలిపారు. ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రతిఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందన్నారు.

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు..

Advertisement

సోషల్ మీడియా(వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్)లో వచ్చే అనధికారిక వైద్య సలహాలు, చిట్కాలను నమ్మి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, తప్పనిసరిగా అర్హులైన డాక్టర్ల సలహాలు మాత్రమే పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులను అభినందించి సత్కరించారు.

Also Read: PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!

కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం..

Advertisement

ఇదిలాఉండగా తొలుత కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని వీర సైనిక స్మారక స్థూపం వద్ద రాంచందర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి, చెక్కుచెదరని సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. వారి త్యాగాలను మరువలేమని పేర్కొన్నారు. కార్గిల్‌లోని దుర్భేద్యమైన శిఖరాలపై మన వీర జవాన్లు అసాధారణ శౌర్యాన్ని ప్రదర్శించి, త్రివర్ణ పతాక గౌరవాన్ని, దేశ ప్రతిష్ఠను కాపాడుతూ భారత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారని అన్నారు.

వన్ ర్యాంక్-వన్ పెన్షన్..

మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లకు వినమ్ర నివాళులు అర్పిస్తున్నామని, దేశ సరిహద్దులను అహర్నిశలు కాపాడుతున్న భారత సైనికులందరికీ శిరసు వంచి వందనం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ నర్సింహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలో సైనికుల పెన్షన్లకు సంబంధించిన దీర్ఘకాల పెండింగ్ డిమాండ్లను పరిష్కరించడం చారిత్రాత్మక నిర్ణయమని గుర్తు చేశారు. సైనికుల త్యాగాలు దేశం ఎన్నటికీ మరువలేనివని, దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీరుల జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడుకోవాలంటే యువతలో దేశభక్తి, జాతీయ చైతన్యం మరింత పెరగాలని, దేశాన్ని సురక్షితంగా కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also Read: కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×