E-Paper
Advertisement

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!
Advertisement

K Kavitha: స్వేచ్చ బ్యూరో: విద్యార్థులు 36 రోజుల పాటు అలుపెరగకుండా చేసిన పోరాటంతోనే కేంద్రం దిగివచ్చిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేయటంతో పాటు వారి అన్ని డిమాండ్లకు కేంద్రం అంగీకరించటం వెయ్యి శాతం విద్యార్థుల విజయమేనని చెప్పారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించటం సిగ్గుచేటన్నారు.

2 లక్షల ఉద్యోగాలు..

తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ విద్యార్థులు నిలదీస్తారోననే భయంతోనే, నగర వీధుల్లో ఊరేగింపులు చేస్తూ కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడారని మండిపడ్డారు. ఏనాడు తెలంగాణ యువత, విద్యార్థుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, ఇప్పుడు 21 ఏళ్లకే యువత పార్లమెంట్‌లో ఉండేలా బిల్లు తెస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ హమీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత పార్లమెంట్ కు వెళ్లే బిల్లు తెస్తానని చెప్పటం సంతోషమేనని కవిత అన్నారు.

Advertisement

Also Read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

అట్టహాసంగా 1000 కోట్లు..

కానీ అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టినా, కేంద్రం వద్ద ఆ బిల్లు పాస్ కాకుండా అంతర్గతంగా ఒప్పందం చేసుకుంటున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీసీ బిల్లు విషయంలో ఎలా మోసం చేస్తున్నారో బీసీలు గమనిస్తున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అట్టహాసంగా 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లో ఊరేగింపులు చేసినంత మాత్రాన మీ చరిత్రను, వైఫల్యాలను యువత మర్చిపోదన్నారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయమని హెచ్చరించారు.

Advertisement

Also read: Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

Related News

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×