E-Paper
Advertisement

PM Modi: నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన ప్రధాని మోడీ.. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర..!

PM Modi: నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన ప్రధాని మోడీ.. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర..!

PM Modi: దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు ప్రధాని మోడీ. తన పాలనాదక్షతతో సరికొత్త మైలురాయి చేరుకోబోతున్నారు. పీఎంగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన జూన్ 9తో రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అంతే కాదు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తున్నారు. 12 ఏళ్ల నిరంతరాయ పాలనను పూర్తి చేసుకున్న మోడీ. జూన్ 10న మరో సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ప్రధానిగా 4వేల 399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందించిన తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోడీ అధిగమించనున్నారు.

ఈ 12 ఏళ్ల మోడీ శకం..

దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన కాలంగా ఈ 12 ఏళ్ల మోడీ శకం నిలిచిపోనుంది. గతంలో దేశానికి అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలుగా ఉన్న నక్సలిజం మోడీ వ్యూహాలతో దాదాపు నిర్వీర్యమైంది. యూపీఏ హయాంతో పోలిస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాద దాడులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పొరుగు దేశం పాకిస్తాన్ అనుసరిస్తున్న అణ్వాయుధ బెదిరింపుల వ్యూహాన్ని భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదానికి మద్దతిస్తే చూస్తూ ఊరుకోమనే బలమైన సందేశాన్ని పంపింది.

సంక్షేమ పథకాలు

మోడీ 12 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు పేదలకు చేరాయి. జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు, మొబైల్ విప్లవంతో లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మధ్యవర్తులు, దళారీల వ్యవస్థను నిర్మూలించి లక్షల కోట్ల రూపాయల అవినీతికి అడ్డుకట్ట వేశారు. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించి పేదల జీవన ప్రమాణాలను మార్చివేశారు. వక్ఫ్ చట్ట సవరణ, పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసిన ఘనత మోడీ సొంతం. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొన్న మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియ మోడీ హయాంలోనే ప్రారంభమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా ప్రధాని మోడీకే దక్కుతుంది.

Also read: ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు, ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం

ప్రధాన ఆర్థిక వ్యవస్థ..

మోడీ హయాంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. కరోనా మహమ్మారి, అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభాలు ఎదురైనా భారత్ సగటున 7.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్‌కు భారత్ గ్లోబల్ హబ్‌గా మారింది. గతంలో అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, కొత్త ఎయిర్ పోర్టులు , రైల్వే విద్యుద్దీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, పోర్టుల ఆధునీకరణతో దేశ రవాణా రంగం సరికొత్త రూపు సంతరించుకుంది.

ఆర్టికల్ 370 రద్దు..

మోడీ హయాంలో భారత్ ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. అమెరికా, చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్ సరసన ప్రపంచంలోని ఐదు అత్యంత ప్రభావవంతమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దశాబ్దాలుగా నలుగుతున్న జాతీయ, సాంస్కృతిక వివాదాలకు మోడీ హయాంలో శాశ్వత పరిష్కారం లభించింది. శతాబ్దాల నాటి నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపి, శాంతిభద్రతలను పునరుద్ధరించారు.

హిందుత్వ ఎజెండా..

నరేంద్ర మోడీ నేతృత్వంలోని 12 ఏళ్ల NDA పాలనపై ప్రశంసలే కాదు విమర్శలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం దేశాన్ని వృద్ధి పథంలో నడిపిస్తోందని చెబుతున్నా, ఆర్థిక విధానాలపై విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ లోపాలు, సంపద కొద్ది మంది కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లో కేంద్రీకృతమై పేద ధనిక వ్యత్యాసం మరింత పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. హిందుత్వ ఎజెండా కారణంగా మైనారిటీల్లో ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ వర్గాలలో అభద్రతా భావం పెరిగిందన్నది విమర్శకుల వాదన.

Also Read: TMC Revolt: మూడు ముక్కలైన తృణమూల్ కాంగ్రెస్.. మౌనంగా ఉన్న ఆ మూడో వర్గం కథేంటో..?

ప్రతిపక్ష నాయకుల టార్గెట్ కోసం..

మణిపూర్ హింస, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మోడీ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాయి. CBI, ED, IT వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయడానికే వాడుకుంటోందని మోడీపై ఆరోపణ ఉంది. మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రతిపక్షాలు అధికారంలో ఠఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థ ద్వారా పాలనకు ఆటంకాలు కలిగిస్తున్నారని, రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ప్రాంతీయ పార్టీలు తరచూ ఆరోపిస్తున్నాయి. కొన్ని కీలకమైన చట్టాల విషయంలో ముందస్తు సంప్రదింపులు లేకుండా, పార్లమెంటులో విస్తృత చర్చ జరపకుండా ఏకపక్షంగా ఆమోదించారనే విమర్శ ఉంది.

రైతు ఉద్యమాలు..

కేంద్రం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు దాదాపు ఏడాది కాలం పాటు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. తీవ్ర ఒత్తిడి నడుమ ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం.. CAA రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా ఉందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చైనాతో సరిహద్దు వివాదాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని, నేపాల్, మాల్దీవులు తదితర పొరుగు దేశాలపై భారత్ తన పట్టును కోల్పోయిందన్నది విమర్శకుల ఆరోపణ.

భారత్ @ 2047 లక్ష్యం..

ఏదేమైనా కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో, సుస్థిరమైన నాయకత్వంతో నరేంద్ర మోడీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ రంగాలలో దూసుకుపోతూ దేశ యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దుతున్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మంత్రంతో వికసిత భారత్ @ 2047 లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేయిస్తున్నారు.

Also Read: గుండ్ల పోచంపల్లిలో బయటపడ్డ నయా భూ దందా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్..!

Related News

RajyaSabha Elections: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నయా ట్విస్ట్.. నంబర్లు లేకపోయినా అభ్యర్థులను దింపిన బీజేపీ!

Gaokao Security: చైనాలో క్వశ్చన్ పేపర్ తయారీ వెనుక ఉన్న నయా సీక్రెట్.. తెలిస్తే మతి పోవాల్సిందే..?

TMC Revolt: మూడు ముక్కలైన తృణమూల్ కాంగ్రెస్.. మౌనంగా ఉన్న ఆ మూడో వర్గం కథేంటో..?

Anuroop Reddy: నీ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్..!

Cyber Hacking: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అకౌంట్ హ్యక్ కలకలం

E85 Fuel: సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా.. కేంద్రం గుడ్ న్యూస్..?

మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

×