సీఎం రేవంత్ పదే పదే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేయడంతో .. కిషన్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్‌కు దిగాడు. పన్నెండేండ్లు మీరేం చేశారో.. పదేండ్లు బీఆరెస్ ఏం చేసిందో.. రెండేండ్లుగా మేమేం చేశామో.. తేల్చుకుందాం రా..!అని సీఎం రేవంత్‌రెడ్డి నిన్న సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్స్ ఏర్పాటు చేయిస్తానని, జనాలంతా చూస్తారని రేవంత్‌రెడ్డి సవాల్ విసరడంతో ఇది రాజకీయంగా చర్చకు తెరలేపింది. అయితే దీనిపై బీఆరెస్ సైలెంట్‌గానే ఉంది.
ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. కానీ కిషన్‌రెడ్డి మాత్రం సై అన్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం ఎవరేం చేశారో తేల్చుకుందాం రా! అని ప్రతిసవాల్ విసిరాడు. అయితే.. కిషన్‌రెడ్డి స్పందనలో దాదాపుగా తనపై రేవంత్ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవడానికే సరిపోయింది. చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు రేవంత్. పార్టీలో పదవులు అనుభవిస్తూ పార్టీకి మేలు చేసింది లేదని, పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గుజరాత్‌లకు గులామీగా ఉండిపోతున్నారని కూడా అన్నారు. తానెవరికీ గులాము కాదని, పార్టీ కోసమే చచ్చే వరకు పని చేస్తానని చెప్పుకొచ్చారు కౌంటర్‌గా కిషన్‌రెడ్డి. సీఎం సహా, మంత్రులంతా తెలంగాణ భూములన్నీ దోచుకుంటున్నారని .. తను కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగాడు కిషన్‌రెడ్డి.
ఈ పాలన ఇలాగే కొనసాగితే ఒక్క ఎకరం కూడా మిగలనివ్వరని కూడా ధ్వజమెత్తాడు. తాను ఢిల్లీకి వెళ్లి తెలంగాణ కోసం నిధులు, పరిష్కారాల కోసం ఏఏ మంత్రిని కలుస్తానో.. మూడు రోజుల తరువాత వారి వద్దకు వెళ్లి వాటికి పర్మిషన్లు ఇవ్వొద్దని, నిధులు కేటాయించొద్దని కిషన్‌రెడ్డి చెప్పి వస్తున్నాడనేది సీఎం ప్రధాన ఆరోపణ. దీన్ని ఖండించాడు కిషన్‌రెడ్డి. తానెందుకు అడ్డుకుంటానని అన్నారు. తెలంగాణ కోసం నేను పడ్డ శ్రమ, కష్టం.. తెచ్చిన నిధుల వివరాలన్నీ వివరిస్తానని, చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. అయితే దీనిపై వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు కిషన్‌రెడ్డికి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని పదుల సార్లు కలిసినా ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వానికి తీవ్రంగా ఉన్న సమస్య.. ధాన్యం కొనుగోళ్లు. దీనిపైనే కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నదీ సర్కార్. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే క్రమంలో సీఎం … కిషన్‌రెడ్డికి ఈ నెల 15 వరకు గడువిచ్చారు. ఆ తరువాత ఎక్కడికక్కడే నిలదీస్తామన్నారు. ధాన్యం కుప్పలు తెచ్చి కిషన్‌రెడ్డి ఇంటి ముందు, బీజేపీ పార్టీ ఆఫీసు ముందు పోసి రైతులతో నిరసన తెలుపుతామన్నారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇలా కొనసాగుతున్న సమయంలో.. మరోవైపు సీఎం పెట్టిన డెడ్‌లైన్‌కు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. ఎలాగూ కేంద్రం ఒప్పుకోదు. మరి ఆ మిగిలిన ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? కిషన్‌రెడ్డిని ఎలా ఇరుకున పెట్టనున్నారు? ధాన్యంతో నిరసనల సెగలు కేంద్రం మెడలు వంచుతాయా? ఇప్పుడు ఇవన్నీ హాట్ టాపిక్‌గా మారనున్నాయి. ఇక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి.