Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై తొలిసారి బీజేపీ నోరు విప్పింది. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటి నుంచి తాము చెబుతున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు సదరు కేంద్రమంత్రి. సీబీఐ చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాకపోతే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ కాపాడి చాలావరకు ఆలస్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సత్యానికి తలొగ్గి చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి అంగీకరించిందన్నారు.
దీనిపై వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. మరొ కొత్త విషయాన్ని బయటపెట్టారు కేంద్రమంత్రి. గతంలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం సిట్‌ని నియమించిందన్నారు. ఇప్పటివరకు సిట్‌ని నియమించలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటికీ అంతం కాని రోజువారీ సీరియల్ మాదిరిగా కొనసాగుతోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ విచారణకు ముందు సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ బీజేపీ పదేపదే డిమాండ్ చేసింది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. చివరకు ఆ పార్టీ సభ్యుడు పాల్వాయి హరీష్‌బాబు నోరు విప్పారు.
ALSO READ: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్యూటీలో డ్రైవర్లకు ఫోన్ కట్
తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కమీషన్లు రావనే ఉద్దేశంతో మేడిగడ్డకు తరలించారు. కమిషన్ నివేదికపై ఆ విషయం తేటతెల్లమైందని సభలో వ్యాఖ్యలు చేశారాయన. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు లోతుగా దర్యాప్తు సాగుతోంది. ఇంకోవైపు ఫార్ములా ఈ-రేసు, ప్రస్తుతం కాళేశ్వరంపై దర్యాప్తు ఏకంగా సీబీఐ చేతికి వెళ్లింది. ఎటు చూసినా బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవన్నమాట.
అన్నట్టు ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై రేపో మాపో రంగంలోకి సిట్ దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని అంటున్నారు తెలంగాణ రాజకీయ నేతలు. టోల్ టెండర్ ప్రైవేటు సంస్థకు అప్పగించడం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు.
తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కమీషన్లు రావనే ఉద్దేశంతో మేడిగడ్డకు తరలించారు. కమిషన్ నివేదికపై ఆ విషయం తేటతెల్లమైందని సభలో వ్యాఖ్యలు చేశారాయన. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు లోతుగా దర్యాప్తు సాగుతోంది. ఇంకోవైపు ఫార్ములా ఈ-రేసు, ప్రస్తుతం కాళేశ్వరంపై దర్యాప్తు ఏకంగా సీబీఐ చేతికి వెళ్లింది. ఎటు చూసినా బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవన్నమాట.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ టోల్ టెండర్‌ను 2023లో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు అప్పగించింది. 30 ఏళ్ల పాటు రూ. 7,380 కోట్లకు లీజుకు ఇచ్చింది. అంతకుమందు ఈ టోల్ నిర్వహణ ప్రక్రియ హెచ్ఎండీఏ పరిధిలో ఉండేది. ప్రతీ ఏటా 350 నుంచి 450 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది.
తక్కువ మొత్తానికి లీజుకు ఇవ్వడమే అసలు చిక్కు వచ్చింది. ఈ వ్యవహారం వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయని అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ వేదికగా సిట్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.
BJP’s stand vindicated.
BRS is solely responsible for the massive corruption in Kaleshwaram. From the very beginning we demanded a CBI probe, but Congress shielded BRS and delayed action.
Today the govt has bowed to truth and agreed to hand over the case to CBI. We demand the…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 1, 2025
బీజేపీ వాకౌట్ చేసినా సభలోనే ఉండి ప్రసంగించిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అవాస్తవమని స్పష్టం
తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేపడితే కమీషన్లు రావనే ఉద్దేశంతోనే మేడిగడ్డకు ప్రాజెక్టును తరలించారనేది తేటతెల్లమైందని సభలో కీలక వ్యాఖ్యలు చేసిన… pic.twitter.com/AFi95ktTLi
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025