E-Paper
Advertisement

ఢిల్లీ టు స్వీడన్.. సైకిల్‌పైనే 9,600 కిలోమీటర్లు! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లవ్ స్టోరీ!

ఢిల్లీ టు స్వీడన్.. సైకిల్‌పైనే 9,600 కిలోమీటర్లు! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లవ్ స్టోరీ!
Advertisement

The Cycle of Love:చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు విన్నాం.కానీ ఈ ప్రేమ కథ మాత్రం చాలా డిఫరెంట్.ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ తన ప్రియురాలు దగ్గరికి చేరాడు ఈ  ప్రియుడు.ఇప్పుడు అదే కథ పై ది సైకిల్ ఆఫ్ లవ్’ (The Cycle of Love) అనే టైటిల్ తో ఒక  డాక్యుమెంటరీగా వస్తుంది.దీనిని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండడం ఇక్కడ విశేషం.ఇక తాజాగా ఈ డాక్యుమెంటరీ నుండి వదిలిన  ట్రైలర్ నెట్టింట్లో తెగ  వైరల్ అయిపోయింది.

ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా

Advertisement

స్వీడిష్ యువతి షార్లెట్ (లోట్టా) వాన్ షెడ్విన్ మహానందియా స్కెచ్ లు వేసే తీరు చూసి మెస్మరైజ్ అయిపోయింది ఈ స్వీడన్ భామ.అంతే అనుకున్నదే తడువుగా తన పోర్ట్రైట్ గీయించుకోవాలని అతని ముందుకు వచ్చింది.ఇక అదే క్రమంలో వారి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఆ తర్వాత వారిద్దరూ భారతీయ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు కూడా.అయితే కొన్ని నెలల తర్వాత లోట్టా తన దేశానికి తిరిగి వెళ్లవలసి వచ్చింది.అయితే తన భర్తను కూడా స్వీడన్ కి రమ్మని ఇన్వైట్ చేసినప్పటికీ విమాన టికెట్ కోనేంత  డబ్బులు లేకపోవడంతో మహానందియా ఆగిపోయాడు.అయితే పెళ్లి చేసుకున్న లోట్టాని  విడిచి ఉండలేని మహానందియా  1977లో ఒక హిస్టారికల్ అడ్వెంచరస్ టూర్ కి తెరతీశాడు.

ఇక దారి పొడవునా  అక్కడి ప్రజల బొమ్మలను గీస్తూ

Advertisement

అనుకున్నది తడువుగా ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ ని తీసుకున్న మహానందియా ఢిల్లీ నుంచి స్వీడన్ వైపు బయలుదేరాడు.నాటి హిప్పీ ట్రైల్ దారిలో నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ,ఇరాన్, టర్కీల మీదుగా ఐరోపా లోకి ఎంటర్ అయ్యాడు.ఇక దారి పొడవునా  అక్కడి ప్రజల బొమ్మలను గీస్తూ వాటిని అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో ఎన్నో కష్టాలను అధిగమించి దాదాపు నాలుగు నెలల పాటు ప్రయాణించి స్వీడన్ కి చేరుకున్నాడు మహానందియా.ఈ నాలుగు నెలల కాలంలో మహానందియా  దాదాపు 6వేల మైళ్ళు అంటే సుమారు 9600 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం గమనార్హం.

ఆగస్టు 28న అమెరికాలో సెప్టెంబర్ 18న యూకేలో

అలా  తన భార్య లోట్టాని కలుసుకున్నాడు.అప్పటి  నుండి 50 ఏళ్లుగా ఈ జంట స్వీడన్ లోనే అన్యోన్యంగా జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.అయితే ఇదే అద్భుత ప్రేమ కథ ఆధారంగా పెర్ జె. స్వెన్సన్ అనే రచయిత ది అమేజింగ్ స్టోరీ ఆఫ్ ద మ్యాన్ హూ సైకిల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా టు యూరోప్ ఫర్ లవ్అనే పుస్తకాన్ని రాశాడు కూడా .ఇక ఇది అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్‌గా నిలవడం విశేషం.ఇక ఇప్పుడు ఈ అద్భుతమైన లవ్ స్టోరీని ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ దర్శకుడు ప్రముఖ దర్శకుడు ఓర్లాండో వాన్ ఐన్సీడెల్ విజువల్ వండర్ గా మలవడం విశేషం.గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 28న అమెరికాలో సెప్టెంబర్ 18న యూకేలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఏది ఏమైనా ప్రేమ ఉంటే చాలు సరిహద్దులు,భాషలు అడ్డుకావు అని నిరూపించిన మహానందియా లవ్ స్టోరీ ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుందనడంలో సందేహం లేదు.

also read:ఆ ఒక్క సినిమా తెచ్చిన తంటా: రూ. 7.35 కోట్ల పెనాల్టీతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ కమెడియన్!

Related News

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ ప్రయత్నం వృధా అయ్యిందా..? ఆ ఒక్కటే మిస్టేక్ నా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Big Stories

Advertisement
×