E-Paper
Advertisement

Bandla Ganesh MP Application : ఎన్నికల బరిలో బండ్ల గణేశ్‌..! మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు..

Bandla Ganesh Application For Congress MP Ticket : మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు.

Bandla Ganesh MP Application : ఎన్నికల బరిలో బండ్ల గణేశ్‌..! మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు..
Advertisement

Bandla Ganesh MP Application : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మల్కాజిగిరి టిక్కెట్ కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు చేసుకున్నారు. అయితే మల్కాజిగిరి స్థానం కోసం మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే కాంగ్రెస్ నుంచి చాలామంది ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం నుంచి పోటీ చేయాలని యోచనలో ఉన్నారు. ఆమె తరఫున అనుచరులు గాంధీ భవన్‌లో ఎంపీ టిక్కెట్ కు దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అదే స్థానాన్ని ఆశిస్తున్నారు. ఖమ్మం ఎంపీ సీటు కోసం వీహెచ్ దరఖాస్తు చేశారు. భువనగిరి ఎంపీ స్థానానికి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి దరఖాస్తు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌, కె.నగేశ్‌ కూడా ఎంపీ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేశారు.

Advertisement

నాగర్ ‌కర్నూల్‌ స్థానాన్ని మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆశిస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, వరంగల్‌ టిక్కెట్ కోసం న్యాయవాది చల్లూరి మధు దరఖాస్తు చేసుకున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×