BigTV English

James Anderson : అతని అనుభవమంత లేదు.. వారి వయస్సు!

James Anderson : అతని అనుభవమంత లేదు.. వారి వయస్సు!
James anderson career

James anderson career (sports news today India) :


విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టులో ఒక విచిత్రమైన అంశం చోటు చేసుకుంది. అది నెట్టింట వైరల్ గా మారింది. అదేమిటంటే ఇంగ్లాండ్ జట్టులో వెటరన్ బౌలర్  41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. తనని రెండో టెస్ట్ లోకి తీసుకున్నారు. అలాగే జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానంలో షోయబ్ బషీర్ ని తీసుకున్నారు. అలాగే రెహన్ అహ్మద్ కూడా జట్టులోనే ఉన్నాడు.

ఇప్పుడిక్కడే ఒక చిత్రం జరిగింది. అదేమిటంటే జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ తరఫున 2003లో జింబాబ్వేతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పటికి దాదాపు రెండు దశాబ్దాలపైనే అయ్యింది. అంటే 21 సంవత్సరాలు అన్నమాట. ఇంతకాలంగా తను ఇంగ్లాండ్ జట్టులో క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు.


ఇప్పుడు ఇంగ్లాండ్ తరఫున కొత్తగా ఆడుతున్న షోయబ్ బషీర్ వయసు 20 ఏళ్లయితే, రెహాన్ అహ్మద్ వయసు 21 ఏళ్లు అన్నమాట. బషీర్ 2003 అక్టోబర్ 13న జన్మిస్తే, రెహాన్ అహ్మద్ 2004 ఆగస్టు 13న పుట్టాడు.

అంటే అండర్సన్ క్రికెట్ లో చేరినప్పటికి వీళ్లింకా పుట్టలేదన్నమాట. అండర్సన్ మే నెల 2003లో తన తొలి మ్యాచ్ ఆడితే, రెహాన్ అహ్మద్ అదే ఏడాది ఆగస్టులో పుట్టాడు. అంటే తను క్రికెట్ లో ప్రవేశించిన 4 నెలల తర్వాత రెహాన్ పుట్టాడు.

ఇదే మాట నెట్టింట వైరల్ గా మారింది. అందరూ అనేదేమిటంటే, ‘అండర్సన్ అనుభవమంత లేదు.. వీరిద్దరి వయసు’ అని నాటి సీనియర్ ఎన్టీఆర్ పాపులర్ డైలాగ్ కోట్ చేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ…అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అండర్సన్ అయితే రెండు దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. తన సహచరులందరూ రిటైర్ అయ్యి కోచ్ లు, కామెంటేటర్ల పాత్రలోకి వెళ్లిపోయారు. కానీ తను మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు.

ఇప్పటివరకు అండర్సన్ 183 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 690 వికెట్లు తీసుకున్నాడు. బహుశా మరో 10 వికెట్లు తీసి 700 వికెట్ల క్లబ్ లో చేరిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలామంది అంటున్నారు. తన కంటే ముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), ఆసీస్ మాజీ ప్లేయర్, దివంగత షేన్ వార్న్ (708)లు ఉన్నారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×