BigTV English

Bathukamma: ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు

Bathukamma: ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు

Bathukamma Celebrations: అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిలైడ్‌ నగరంలోని ఎల్డర్ పార్క్ లో ఉన్న ఆడిలైడ్ ఫెస్టివల్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలలో సుమారు 500 మంది పాల్గొన్నారు. వీరిలో పలువురు స్థానికులు కూడా ఉన్నారు. వీరంతా తెలంగాణ సంప్రదాయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని మరీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో.. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒకచోట చేర్చిన ఆడపడచులు సంప్రదాయ పద్ధతిలో పాటలో పాడి వాటిని పూజించారు. అనంతరం ఊరేగింపుగా సమీపంలోని టోరెన్స్‌ నదిలో నిమజ్జనం చేశారు. ఎల్డర్‌ పార్క్‌లో ఈ వేడుకల్ని నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా టోరెన్స్‌ ఎంపీ వొర్టీ, సాంస్కృతిక శాఖా మంత్రి జోబెట్టిసన్, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో విపక్ష ఉపనేత జింగ్ లీతో సహా కౌన్సిలర్లు జగదీష్ లఖాని, సురేందర్ పాల్, ఆ ప్రాంతపు పలువురు భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.


Also Read: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్… సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనట

ఈ కార్యక్రమంలో ముందుగా అడిలైడ్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షురాలు మమతా దేవా బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అడిలైడ్‌ తెలంగాణ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షురాలు యారా హరితా రెడ్డి, సంస్థ వ్యవస్థాపకులు ఆదిరెడ్డి యారా, ఛైర్మన్ రాజై కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు సౌజన్య, కోశాధికారి ప్రత్యూష, కార్యదర్శి సృజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అనిల్ పగడాల, నిఖిల్ తాళ్లూరి, ప్రశాంత్ రెడ్డి, చరిత్ రెడ్డి, సుమంత్, సామ్రాట్, మనోహర్ తదితరులు కార్యక్రమం విజయవంతం కావటానికి తమవంతు సహకారాన్ని అందించారు. శివగర్జన టీమ్‌లోని వాలంటీర్లైన శ్రీనివాస్‌ వడ్లకొండ, సంజయ్‌ మెంగర్‌, తదితర వాలంటీర్లు ఈ వేడుక విజయవంతంగా జరగడానికి కృషి చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చాలా మంది భారతీయులు కూడా పాల్గొని సందడి చేశారు.


Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×