ORR Toll Lease: మాజీ మంత్రి కేటీఆర్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయారు. విచారణ నుంచి తప్పించుకు నేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనపై ఏసీబీకి ఫిర్యాదులు మొదలయ్యాయి. ఇంతకీ కంప్లైట్ సారాంశం ఏంటి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఓఆర్ఆర్ టోల్ అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు వెల్లువెత్తున్నాయి. దీనిపై నిగ్గు తేల్చాలంటూ లేటెస్ట్‌గా బీసీ పొలిటికల్ జేఏసీ.. ఏసీబీతోపాటు సీఎం, సీఎస్, ఈడీలకు పిర్యాదు చేసింది. టోల్ లీజ్‌పై క్విడ్ ప్రోకో జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు 7,300 మేరా అవినీతి జరిగిందని ఆరోపించింది.
ఓఆర్ఆర్ చుట్టూ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతమంతా హెచ్ఎండీఏ చేస్తోందన్నారు బీసీ పొలిటికల్ జేఏసీ యుగంధర్. ఆదాయం వచ్చే ప్రాంతాన్ని వేరే కంపెనీలకు ఇచ్చారని అన్నారు. ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 2023 ఏప్రిల్ నుండి 30 ఏళ్ళ పాటు లీజ్ ఇచ్చారని చెబుతున్నారు.
రోడ్డు వరకు కంపెనీకి అప్పగించారని, గ్రీనరీ సర్వీసు రోడ్డు హెచ్ఎండీఏ నిర్వహిస్తోందన్నారు. ఆ కంపెనీ 25 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కు ఇచ్చిందన్నారు. లీజుకు తీసుకున్న కంపెనీలో వాహనదారుల నుంచి ఫిర్యాదు తీవ్రమయ్యాయని చెప్పారు. ఈ లీజును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ALSO READ: ఫార్ములా ఈ రేసు కేసు.. కేఏ పాల్ మాటలు
హెచ్ఎండీఏ నిధులపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపి, నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు.
కైటెక్స్ గార్మెన్స్ సంస్థకు వరంగల్‌లో యూనిట్ మొదలుపెట్టినప్పుడు ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందన్నారు. ఆ సంస్థకు హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డిలో భూకెటాయింపులు జరిగాయన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి డీటేల్స్ మొత్తం అధికారులకు అందజేశామన్నారు.