Formula E Race Case: స్వతహాగా రాజకీయ నేతలు ట్రెండ్ సెట్ చేస్తారు. కానీ మనకు పైన కనిపిస్తున్న వ్యక్తి ట్రెండ్‌ను ఫాలో అయ్యే నేతల్లో ఒకరు. ఆయనెవరో కాదు ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్. విషయం ఏదైనా నిత్యం వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తుల్లో ఆయనదే ఫస్ట్ ప్లేస్.
తెలుగు రాష్ట్రాల్లో ఫార్ములా ఈ కారు రేసు కేసు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారాయన. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసు కేసు అంశం చాలా చిన్నదన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, అవినీతి జరిగినట్టు రుజువైతే ఎవరినైనా అధికారులు అరెస్ట్ చేస్తారన్నారు. కేటీఆర్ ఎంత అవినీతి చేశారనేది విచారణలో తేలుతుందన్నారు. ఇంతకుమించి ఈ కేసు గురించి మాట్లాడడం సరికాదన్నారు.
బుధవారం ఏపీ వెళ్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ క్రమంలో అదానీ వ్యవహారాన్ని ఎత్తుకున్నారు. ఆంధ్రాలో జరిగిన అదానీ అవినీతి వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీబీఐ డైరెక్టర్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబులకు లేఖ రాసినట్టు చెప్పారు.
ఎవరి ఒత్తిడి మేరకు అదానీని కాపాడుతున్నారని ప్రశ్నించారు కేఏ పాల్. విద్యుత్ ఒప్పందాలను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారన్నది ఆయన ఆవేదన.. ఆందోళన. జగన్- అదానీ విద్యుత్ వల్ల ఏపీ ప్రజలకు పవర్ చార్జీలు షాక్ కొడుతున్నాయని అన్నారు. ఏపీలో లక్ష కోట్ల అవినీతి జరిగితే.. 9 నెలలు అయినా అదానీ వ్యవహారంపై ఎందుకు సైలెంట్ అయ్యారో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ALSO READ: సుప్రీంకోర్టులో కేటీఆర్ కు షాక్? ఆందోళనలో బీఆర్ఎస్ వర్గాలు