E-Paper
Advertisement

BC Reservations: బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మరో భారీ ఉద్యమం చేయాల్సిందే.. ఆర్ నారాయణ మూర్తి మాస్ వార్నింగ్

BC Reservations: బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మరో భారీ ఉద్యమం చేయాల్సిందే.. ఆర్ నారాయణ మూర్తి మాస్ వార్నింగ్
Advertisement

BC Reservations:హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల కీలక సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా వేడెక్కింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు, ప్రజా ఉద్యమకారుడు ఆర్. నారాయణ మూర్తి తనదైన శైలిలో ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. దేశానికి వెన్నుముకగా నిలిచిన బీసీ కులాలపై బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని 14 రాష్ట్రాల్లో బ్రాహ్మణులే ముఖ్యమంత్రులుగా పనిచేశారని, కానీ మెజారిటీ వర్గాలైన బీసీలకు మాత్రం రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన చరిత్రను గుర్తు చేశారు.

Advertisement

ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ పై చేసిన తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కల్పించాలని, మీ మాట నమ్మి బీసీలు మీకు ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేకపోతే బీసీ ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.

రిజర్వేషన్ల విషయంలో కేంద్రం తీరును కూడా ఆయన ఎండగట్టారు. ప్రధాని మోదీ వద్దకు రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను తీసుకువెళ్లాలని, ఒకవేళ కేంద్రం రిజర్వేషన్లకు అంగీకరించకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణ పేదలకు ఆగమేఘాల మీద రిజర్వేషన్లు ఇచ్చిన కేంద్రం, బీసీల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ “గడ్ బడ్చేయమంటున్నారని, కానీ బీసీలు తమ హక్కుల కోసం రాజీపడకూడదని ఆయన అన్నారు.

Advertisement

తెలంగాణలో బీసీల హక్కుల కోసం మరో భారీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. ఇందుకోసం బీసీలలోని అన్ని ఉప కులాలు, సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని కోరారు. ఇన్నాళ్లుఓట్లు మావి.. సీట్లు మీవా?” అన్న ధోరణి సాగిందని, ఇకపై అది చెల్లదని తేల్చిచెప్పారు. “ఓట్లు మావే.. సీట్లు మావేఅనే నినాదంతో భారీ పోరాటానికి సిద్ధం కావాలని, ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యమని ఆయన బీసీ వర్గాలకు దిశానిర్దేశం చేశారు.

Read Also: Husband Wife Dispute: విడాకులు రాకముందే రెండో పెళ్లా? స్టేజ్‌పైకి వచ్చిన మొదటి భార్య.. ఆ తర్వాత ఏమైందంటే!

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×