IPL 2025 : బాల్ బాల్‌కు బెట్టింగ్. ప్రతీ రన్‌కో రేట్. సిక్స్ కొట్టినా.. అవుట్ అయినా.. దేనికైనా బెట్టింగే. గెలిస్తే బోలెడంత. ఓడితే పెట్టిందంతా ఫసక్. బెట్టింగ్ రాయుళ్ల దెబ్బకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్స్ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తీగ లాగితే.. హైదరాబాద్‌లోనే ఆ లింకులు బయటపడుతున్నాయి.
అతడితో జాగ్రత్త.. బీసీసీఐ హెచ్చరిక
ఫిక్సింగ్ కుట్రను BCCI ముందే పసిగట్టింది. ఆ హైదరాబాద్ బిజినెస్‌మేన్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరించింది. IPL టీమ్స్ ఫ్రాంచైజీ ఓనర్లతో పాటు.. క్రికెటర్లు, కోచింగ్ టీమ్, కామెంటేటర్లుకు అలర్ట్ మెసేజ్ చేసింది BCCI. ఫలానా హైదరాబాద్ వ్యక్తి ప్లేయర్లను ప్రలోభ పెడుతున్న గుర్తించింది. టీమ్‌లు బస చేసే హోటళ్లకు వెళ్లి అక్కడ లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిపింది.
ఆ 5 టీమ్స్ టార్గెట్?
క్రికెటర్లకు ఖరీదైన వస్తువులు గిఫ్ట్లుగా ఇచ్చే అవకాశం ఉందంటూ ఇప్పటికే IPL ఓనర్లను BCCI హెచ్చరించిందని తెలుస్తోంది. ఖరీదైన వాచ్‌లు, బంగారు ఆభరణాలు, కార్లు ఆటగాళ్లకు ఆశ చూపి.. ఫిక్సింగ్ చేయడానికి సహకరించమని కోరే అవకాశం ఉందంటూ BCCI చెప్పింది. ఆ హైదరాబాదీ బిజినెస్‌మేన్ ఇప్పటికే 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్టు BCCI ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Also Read : ఓ చిన్నారిపై పేపర్లో వార్త.. సీఎం రేవంత్ ఏం చేశారంటే..
పోలీస్ ఎంక్వైరీ షురూ..
ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం బయటకు రావడంతో తీవ్ర కలకలం చెలరేగింది. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐదుగురు బిజినెస్‌మేన్‌లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. BCCI దగ్గర ఉన్న ఆధారాలను తమకు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈలోగా తమదైన స్టైల్‌లో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు.