Samantha: ఇండస్ట్రీలో ఏళ్లు గడుస్తున్నకొద్దీ హీరోయిన్స్‌కు ఆఫర్లు తగ్గిపోతాయనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ రోజులు మారిపోయాయి. అలా సీనియర్ హీరోయిన్స్‌కు ఆఫర్లు తగ్గిపోవడం అనేది జరగడం లేదు. యంగ్ హీరోయిన్లకు పోటీ సీనియర్ హీరోయిన్లకు కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ కొందరు నటీమణులు మాత్రం కావాలనే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటి వారిలో మొదటి పేరు సమంతదే ఉంటుంది. సమంతకు హీరోయిన్‌గా సినిమాల నుండి ఆఫర్లు వస్తున్నా కూడా తను మాత్రం ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చేయడానికే ఇష్టపడుతోంది. అలాంటి సమయంలో తను చేయాల్సిన వెబ్ సిరీస్‌ను క్యాన్సెస్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించి షాకిచ్చారు.
రెండో సీజన్ ఉండదు
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ అనే సినిమాలో హీరోయిన్‌గా చివరిసారి మెరిసింది సమంత (Samantha). ఆ తర్వాత పూర్తిగా వెబ్ సిరీస్‌లపైనే ఫోకస్ పెట్టింది. అది కూడా చాలావరకు యాక్షన్ వెబ్ సిరీస్‌లు చేయడానికి ఇష్టపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ముందుగా ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో సమంత చేసిన యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సిరీస్ చూసినప్పటి నుండి దీనికి సంబంధించిన రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. కానీ దీనికి అసలు రెండో సీజనే ఉండదని ప్రకటించింది షాకిచ్చింది అమెజాన్ ప్రైమ్.
అన్నీ క్లోజ్
ముందుగా ప్రియాంక చోప్రా, రిచార్డ్ మాడెన్ జంటగా ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లాంచ్ అయ్యింది. అది అమెరికాలో జరిగిన కథతో తెరకెక్కింది. అదే కథ ఇండియాలో జరిగితే ఎలా ఉంటుందో చూపించడం కోసం వరుణ్ ధావన్, సమంతతో ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు మేకర్స్. ఆ తర్వాత దీని ఇటాలియన్ వర్షన్‌ను ‘సిటాలెడ్ డయానా’ అనే టైటిల్‌తో తెరకెక్కించారు. అన్ని భాషల్లోనూ ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సిరీస్‌లు అన్నింటికి సెకండ్ సీజన్ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ అమెరికన్ వర్షన్‌కు మాత్రమే రెండో సీజన్ ఉంటుందని ఇండియన్, ఇటాలియన్ వర్షన్స్‌కు సెకండ్ సీజన్ ఉండవని అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చింది.
Also Read: అందంగా ఉన్నందుకే అవకాశాలు రావట్లేదు.. మిల్కీ బ్యూటీ ట్యాగ్‌పై తమన్నా రియాక్షన్
ఎగ్జైటింగ్ సీజన్
అమెజాన్ ఎమ్‌జీఎమ్ స్టూడియోస్ హెడ్ వెర్నోన్ సాండర్స్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ‘‘సిటాడెల్ హనీ బన్నీ, సిటాడెల్ డయానా అనేవి సిటాడెల్ సెకండ్ సీజన్‌లోనే కలిసిపోతాయి. ఇండియన్, ఇటాలియన్ షోస్ సెపరేట్‌గా కంటిన్యూ అవ్వవు. ప్రియాంక చోప్రా నటిస్తున్న సిటాడెల్ సెకండ్ సీజన్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ షూటింగ్ పూర్తయ్యింది. దీని రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘సిటాడెల్ హనీ బన్నీ’కి సెకండ్ సీజన్ ఉంటుందని, అందులో సమంత యాక్షన్ మరోసారి చూడొచ్చని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
Varun Dhawan and Samantha Ruth Prabhu's #CitadelHoneyBunny CANCELLED by Amazon Prime Video.. @PrimeVideo has cancelled the second seasons of both Indian and Italian adaptations of #Citadel, and instead, their storylines will now be woven into the second season of the mothership… pic.twitter.com/iirGlVBs3i
— Rahul Raut (@Rahulrautwrites) April 16, 2025