BigTV English
Advertisement

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్ సోమవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం సభ నిర్వహించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.


గత కొన్నేళ్లుగా మతం, కులం పేరుతో, ఆహారం పేరుతో జరుగుతున్న దాడులపై మేధావులు మౌనం వీడాలని ఆయన అన్నారు.

కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయులందరినీ కలుస్తూ.. అందరి సమస్యలు వింటూ, వారి ఆలోచనలను గౌరవిస్తూ రాహుల్ గాంధీ ముందుకు వెళ్లడం ఒక అద్భుతం అని ప్రశంసించారు.


ఈ కార్యక్రమం లో ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళరపు, మేరీ, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, షాయబ్ ఖాన్, మధుకర్ రెడ్డి, కళ్యాణ్, తదితర 40 మంది టీపీసీసీ ఎన్నారై సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

జనవరి 18న అధికార పర్యటన లో లండన్‌ విచ్చేయనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ, ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడే ‘హలో లండన్’ కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×