E-Paper
Advertisement

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!
Advertisement

TVVP Employees: స్వేచ్ఛ బ్యూరో: డైరెక్టర్ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేగుతోంది. డైరెక్టర్ ఆఫ్​ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న558 మంది టీవీవీపీ ఉద్యోగులను తాజాగా రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.కనీస ముందస్తు సమాచారం లేకుండా, పకడ్బందీగా ప్రణాళిక లేకుండా 558 మంది వైద్యులు, నర్సులు, పారా మెడికల్, మినిస్టీరియల్, క్లాస్-4 సిబ్బందిని రిలీవ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి కారణమయ్యాయి. డీఎంఈ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, 30కి పైగా టీచింగ్ ఆసుపత్రుల నుండి ఉద్యోగులను రిలీవ్ చేశారు. ఇందులో 39 మంది వైద్యులు, 244 మంది నర్సింగ్ స్టాఫ్​, 111 మంది మినిస్టీరియల్ స్టాఫ్​, 48 మంది పారా మెడికల్ స్టాఫ్​, 116 మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ఉన్నారు. వీరందరిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ హెడ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని డీఎంఈ ఆదేశించారు.

రిలీవ్ చేశారు సరి.. పోస్టింగ్ ఎక్కడ?

Advertisement

అయితే ఆ ఆదేశాల మేరకు కోటిలోని కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న బాధితులకు విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయి. రిపోర్ట్ చేసిన ఉద్యోగులను ఎక్కడ విధుల్లో చేర్చుకోవాలి? ఏ జిల్లాకు పంపాలి? ఏ ఆసుపత్రిలో ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై టీవీవీపీ కార్యాలయ అధికారులకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు.దీంతో రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కోటి ఆఫీస్‌కు చేరుకున్న ఉద్యోగులు,మహిళా నర్సులు, సీనియర్ వైద్యులు రోజంతా కార్యాలయ ఆవరణలోని చెట్ల కిందే నిరీక్షించాల్సి వచ్చింది. ఒక శాఖ నుంచి రిలీవ్ అయి, మరో శాఖలో పోస్టింగ్ ఆర్డర్ లేకపోవడంతో వీరి రోజువారీ హాజరు ,వేతనాలు ,లీవ్‌ల పరిస్థితి ఏంటనే దానిపై తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఆ ఉద్యోగులు మండిపడుతున్నారు.

20 ఏళ్ల అనుభవానికి దక్కిన గౌరవం ఇదేనా..?

Advertisement

15 నుండి 20 ఏళ్లుగా డీఎంఈ పరిధిలోని ప్రధాన ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందించిన సిబ్బందిని ఇలా ఒక్కసారిగా వీధి పాలు చేయడం మానవత్వానికే మచ్చ అని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడి, పిల్లల చదువులు, వయోవృద్ధులైన తల్లిదండ్రుల వైద్య అవసరాలు, వ్యక్తిగత సమస్యలతో ఉన్నవారిని కనీసం కౌన్సెలింగ్ కూడా నిర్వహించకుండా ఒకే ఒక్క ఆర్డర్‌తో రోడ్డున పడేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ‘సంవత్సరాలుగా రాత్రింబవళ్లు పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడితే, ఈ రోజు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు’ అని ఒక బాధిత ఉద్యోగి కంటతడి పెట్టారు.

టీవీవీపీ అస్తవ్యస్తం..

ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పాలన పూర్తి అస్తవ్యస్తంగా తయారైంది. అక్కడ పూర్తిస్థాయి కమిషనర్ లేదా డైరెక్టర్ లేకపోవడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నాథుడే కరువయ్యాడు.ఇలాంటి విభాగానికి, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 558 మందిని ఒకేసారి అటాచ్ చేయడం అధికారుల పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒక విభాగం రిలీవ్ చేస్తే, మరో విభాగంలో పోస్టింగ్ ప్రక్రియ సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

కౌన్సెలింగ్ జరిపి పోస్టింగ్‌లు ఇవ్వాలి!

వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి…ఎస్ కే ప్రసన్న , ఐఎన్ టీయూసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ
‘558 మంది సిబ్బందికి వెంటనే సీనియారిటీ, ఖాళీల ఆధారంగా పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి, సత్వరమే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయాలి. పోస్టింగ్ లేని కాలాన్ని కూడా ఆన్ డ్యూటీగా పరిగణించాలి. 20 ఏళ్లుగా వైద్యారోగ్య శాఖలో పని చేయించుకొని సడన్ గా తొలగించడం సరికాదు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయాలి. లేకుంటే ఉద్యోగ సంఘాల మద్ధతుతో పోరాటం చేస్తాం’ అని తెలిపారు.

Also Read: తాపీమేస్త్రీ టు స్కామ్ మాస్టర్‌మైండ్.. రూ. 670 కోట్లు ఎలా కొల్లగొట్టాడో తెలుసా?

Tags

Related News

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

తెలంగాణ గల్లీ కారు.. ఢిల్లీకి చేరగానే కమలం రూపురేఖలు-సీఎం రేవంత్‌రెడ్డి

లక్డికాపూల్ వన్ వే ట్రాఫిక్ ప్లాన్! రిటైర్ బ్యాంక్ ఉద్యోగి పక్కా స్కెచ్, పరిశీలన చేస్తున్న అధికారులు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్లకు బ్రేక్! అసలేం జరిగింది?

బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!

మహిళల అండాల అక్రమ దందా కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

Big Stories

Advertisement
×