E-Paper
Advertisement

Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?
Advertisement

Khammam News: దశాబ్దం తర్వాత దిద్దుబాటు చర్యలుమెదలయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా సర్వే చేపట్టారు. కానీ ఇంతకాలం జాప్యానికి ఎవరిదీ నిర్లక్ష్యం. పాలకులదా? పౌరసమాజానిదా? అమాయకుల ఉసురు తీసిందెవరు? పేదల కోట్లాది కాయకష్టం మట్టిపాలైంది. అక్రమణల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు . జిల్లా యంత్రాంగానికి తెలియకుండానే 10 ఏళ్ళు గడిచాయా? అనే ప్రశ్నలు ఒకవైపు మరోవైపు పేదలకు అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు ఆందోళనల పేరిటహోరెత్తిస్తున్నారు .ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) జోక్యం చేసుకున్నాక దిద్దుబాటు చర్యలు మెదలయ్యాయి .

భూ దానం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

వెలుగుమట్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ లు147,148,149లలో ఆచార్య వినోభాబావే భూదాన్ భూముల్లో నిర్మించిన ఆక్రమణలైతే ఎట్టకేలకు తొలిగిపోయాయి. సమగ్ర సర్వే జరుగుతోంది. ఐతే ఉద్యమ సమయంలో కలువల రాజారావు దానం చేసిన భూమి విస్తీర్ణం ఎంత అనే దానిపై సోషల్ మీడియా కు స్పష్టత లేని కారణంగా అవాస్తవాలు పుకార్లు సృష్టిస్తున్నాయి. కలువల రాజారావు పేరున వెలుగుమట్ల రెవెన్యూ గ్రామంలో 60 ఎకరాల భూమి ఉండేదనేది వాస్తవం. అందులో ఆయన 31.07ఎకరాలు మాత్రమే భూదాన్ యజ్ఞ ట్రస్టు బోర్డు కు దానం ఇచ్చారు . మిగతా 30 ఎకరాలు రావులపాటి నర్సమ్మ, మేకల అచ్చమ్మ , దుండేటిఅప్పయ్య తదితరులకు విక్రయించారు.

Advertisement

Also Read: Instagram 100 Million: ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోవర్స్‌‌తో ఎంత సంపాదన వస్తుంది? ఇలా లెక్కించాలి

భూదాన్ లాండ్ ఎవరికి పంచారు?

ఖమ్మం జిల్లా భూదాన్ యజ్ఞ ట్రస్టు బోర్డు కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వినోభాబావే ఉద్యమ సమయంలో పలు చోట్ల భూములు సమకూరాయి. ఇందులో వెలుగుమట్ల రెవెన్యూ గ్రామంలోని 31.07ఎకరాలు కూడా ఉంది. సదరు భూమిని పుట్టకోట, రుద్రమ్మకోట, గొల్లగూడెం గ్రామాలకు చెందిన భూమిలేనినిరుపేదలకు దానం గా పంపిణీ చేశారు. కానీ ఎర్ర మట్టి గుట్ట (తొండలు గుడ్లుపెట్టే) సాగు చేసుకునేందుకు అనుకూలంగా లేనందున రైతులు భూదాన్ భూములను స్వాధీనం చేసుకోలేదు. కానీ ఆ మూడు సర్వే నెంబర్(147,148,149)ల లోని 31.07ఎకరాలు భూదాన్ యజ్ఞ ట్రస్టు బోర్డు కిందనే కొనసాగింది.

భూదాన్ యజ్ఞ ట్రస్టు బోర్డు కు ఉంది 31.07ఎకరాలే

Advertisement

సరర్వే నెంబర్ 147,148,149 లలో భూదాన్ యజ్ఞ ట్రస్టు బోర్డు భూముల కింద ఉన్నది కేవలం 31.07ఎకరాలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మూడు సర్వే నెంబర్ లలోని మరో సుమారు 32 ఎకరాల భూమి తాము కొనుగోలు చేసామని తమ హక్కు భుక్తం లో ఉందని 2009 నాటికే పుట్టకోట తదితర ప్రాంతాల రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ పై న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి హైకోర్టు లో కేసు వేసి కొట్లాడి గెలిచారని సమాచారం . ఇదిలా ఉంటే జర్నలిస్ట్ సొసైటికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ 2005 నుండి జర్నలిస్ట్ లు దశల వారీగా ఉద్యమాలకు దిగిన విషయం విదితమే . ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు . ఎట్టకేలకు 2009సం.లో భూదాన్ భూముల్లోని సర్వే నెంబర్ 147 కింద 10.20ఎకరాలు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జర్నలిస్ట్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటికి 10.20ఎకరాలు కేటాయించారు . విలేకరుల కు ఇక్కడ ఇంటి పట్టాలు ఎలాట్ కావాల్సిన సమయంలో హైకోర్టులో స్టే కారణంగా తొలి సారిగా జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్ పడింది . ఐతే అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ఉషారాణి పని చేస్తున్న సమయంలోనే జర్నలిస్ట్ లు సదరు హైకోర్టు స్టే ఇక్కడ వర్తించదని వాదించినప్పటికీ వైఎస్ .రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వెలువరించిన జీ.వో పైనే స్టే ఉన్నందున జర్నలిస్ట్ ల ఆశలు అడిఆశలయ్యాయి.

రాజీవ్ విద్యా మిషన్ కు 5.10ఎకరాలు కేటాయింపు

సర్వే నెంబరు147 భూదాన్ భూముల్లో తొలుత 2009లో 10.20ఎకరాలు జర్నలిస్ట్ లకు కేటాయించిన భూమి నుంచి తిరిగి రాజీవ్ విద్యా మిషన్ కు 5.10ఎ.రాలు (సరిగ్గా సగం)ఇచ్చారు . అందులో ప్రభుత్వ నిధులతో కస్తూర్బా వీధిబాలల పాఠశాల భవన నిర్మాణ జరుగుతుండగా నిర్మాణ పనులను జెసిబి తో కూల్చివేతలకు పాల్పడిన సందర్భంగా కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు . (ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలోనే) నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండగానే సదరు భూదాన్ భూముల్లో దురాక్ర‌మ‌ణ‌ల పర్వం మెదలైంది.
అయితే ఇపుడు కస్తూర్బా పాఠశాల ఇదే స్థలంలో విజయవంతంగా నడుస్తున్నది.మోడల్ స్కూల్ కూడా ఇక్కడే ఉంది. జిల్లా అధికార యంత్రాంగం ఇదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పేందుకు యోగ్యంగా ఉన్నందున 147, 148, 149 సర్వే నెంబర్ లలోని భూదాన్ భూములను దురాక్రమణ దారుల కబ్జా నుండి కాపాడుతూ వచ్చారు. మిగిలిన 20 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డు కిందే ఉంది. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీ లో ఉన్నపుడే ఇక్కడి భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నా జరిగాయి కానీ నాడు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటి నిఘా ఉన్నందున నాడు దురాక్రమణలకు వీలు కాలేదు. భూమిరక్షింపబడింది.

కేసీఆర్ హయాంలో రెవెన్యూ భూమిగా మార్పు

2014సం.లో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో యావత్తు రాష్ట్రంలోని భూదాన్ యజ్ఞ ట్రస్టు బోర్డులను రద్దు చేసింది. రాష్ట్రం మెత్తం మీద భూదాన్ భూముల అనుభవ దారులకు నోటీసులు జారీ చేసింది . ఖమ్మంలోని భూదాన్ భూముల్లో ఎవరూ అనుభవదారులు లేనందున అది ప్రభుత్వ రెవెన్యూ శాఖ భూమి గా మిగిలింది.

పేదలు దురాక్రమణకు పాల్పడింది ఎంతమేరకు?

31.07 ఎకరాల్లో ప్రభుత్వ రంగసంస్థ లు మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలకు కేటాయించింది పోగా 20 ఎకరాలు మిగిలింది. వినోభానగర్ పేరిట పేదలు ఆక్రమించింది ఎన్ని ఎకరాలు అన్న దానిపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. 20ఎకరాల్లో మెత్తం పేదలు లేరని, వాస్తవానికి అక్కడ పేదలు ఆక్రమించింది 10ఎకరాలు మాత్రమే నని తెలుస్తోందీ. ఇందులో కూడా ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉండటం విస్తుపోయే అంశం.

లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొవ్వకాలు

దినదినాభివృద్ది చెందుతున్న ఖమ్మంలో పలు ప్రైవేటు అభివృద్ధి నిర్మాణ పనులకు అవసరమైన ఎర్ర మట్టి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొవ్వకాలు ఇక్కడ జరిగాయి. పెద్ద ఎర్ర మట్టి గుట్ట ను తవ్వి మట్టి ని అక్రమార్కులు తరలించారు. ఎర్ర మట్టి తరలిస్తుండగా ఒక్క రెవెన్యూ అధికారి గానీ సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు కానీ పట్టించుకోలేదు . ఒక విలేఖరి ఇంటి నిర్మాణం కోసం పిల్లర్ గోతుల తొవ్వకాలు జరిపినందుకు కేసు నమోదు చేసారు కానీ మట్టి తరలించిన అక్రమార్కుల వైపు కన్నెత్తి చూడలేదు. ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

తుమ్మల నాగేశ్వరరావు దిద్దుబాటు చర్యలు

భూదాన్ యజ్ఞ బోర్డు భూమిపట్ల సమగ్ర అవగాహన కల్గిన ఖామ్మానికే చెందిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి దశాబ్దకాలం పట్టింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దుబాయ్‌ వెళ్లి చిక్కుకుపోయారనే వాస్తవం తెలియనందున ఆయన రక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై ప్రెస్ నోట్ లు విడుదల చేయడం మినహా మీడియా ముందుకు వచ్చే సాహసం చేయడం లేదని సోషల్ మీడియా లో ముప్పేట దాడి మెదలైంది. కానీ ఆయన కుటుంబ సభ్యుడి మెరుగైన చికిత్స నిమిత్తం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరు రోజుల క్రితం దుబాయ్ వెళ్లారు . చికిత్స ముగించుకుని తిరిగి రావాల్సి ఉండగా, ఈ లోపే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.దుబాయ్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా దాడులు జరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది.
ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్ వచ్చే వరకు విమానాలు నడిచే అవకాశం లేకపోవడంతో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. జరగాల్సిన డ్యామేజ్ నివారించడానికి అవకాశం లేకుండా పోయింది . మెత్తం వ్యవహారంలో ఈమధ్య నే బదిలీ పై ఖమ్మం ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అధికారిపై బదిలీ వేటు పడింది.

Also Read: Kiss of the Spider Woman OTT : జెన్నిఫర్ లోపెజ్ నటించిన మ్యూజికల్ డ్రామా ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×