Hyderabad Water Supply Affected: ఎండాకాలం వచ్చేసింది. నీటి ఎద్దడి కూడా మొదలవుతుంది. ఇక హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం కలగనుంది. నగరంలో చాలా చోట్ల ఇప్పటికే బోర్లలో నీరు అడుగంటి పోతోంది. దీని వల్ల నీటి కొరత ఏర్పడుతుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం జలాశయాల నీటి మట్టం తగ్గిపోవడంతో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాథమిక నీటి వనరులు, దాని రిజర్వాయర్లు తగ్గిపోతున్నాయి. వేసవినెలలు నమీపిస్తుండడంతో హైదరాబాద్ లోని నీటి వనరుల సుస్థిరత ముప్పు పొంచి ఉండటంతో మున్ముందు ఇలాంటి పరిస్తితి ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
దీని కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మార్చి 10, 2024న ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు తాగునీటి సరపరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కాస్త నీటిని పొదుపుగా నీటిని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు మెట్రో పాలిట్ వాటర్ సప్లై అండ్ బోర్డ్ (HMWS &SB) సరిగ్గా సంసిద్దం లేనట్లు కనిపిస్తోంది. నీటి ట్యాంకర్ డెలవరీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ సమీపంలో ఉన్నవారు నీటి సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పాలిట్ వాటర్ సప్లై అండ్ బోర్డ్ ప్రస్తుతం రోజుకు హైదరాబాద్ లో 565 మిలియన్ల గ్యాలన్లు సరఫరా చేస్తుంది.
Read more: హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు తెచ్చింది.. మరింత అభివృద్ధి చేస్తాం..
రాబోయే రోజుల్లో అదనంగా 50 ఎంజీడీ కీలకం కానుంది. హైదరాబాద్ లోని 70 మంచినీటి ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణలోని ప్రస్తుత నివేధిక ప్రకారం .. 5000 లీటర్ల ట్యాంకర్ ధర రూ.600 నుండి 2,000 వరకు వుంటుంది. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి సుదూర ప్రాంతాలకు ఎక్కువ ఛార్జీలు ఉంటాయి. ఎంతే కాకుండా వాటర్ సప్లై చేసే వాళ్లు ఇరుకు గల్లీలలో నివాసముంటున్న వారి ఆర్డర్లను నిరాకరిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో అయితే రోడ్లు అన్ని పెద్దవిగా ఉన్న కార్లు, బైక్ లు, పార్కింగ్ వల్ల నీటి ట్యాంకర్లు వెల్లడం ఇబ్బందికరంగా మారింది.
నీటి కొరత ఏయే ప్రాంతాల్లో ఏర్పడతాయంటే.. సియాసత్ డైలీ నివేదిక ప్రకారం విజయనగరం కాలనీ, హుమాయున్ నగర్, ఏసీ గార్డ్స్ ,నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, జంగం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకపూల్, సీతారాం బాగ్, చిరాగ్ అలీ లేన్, బీఆర్ కే భవన్, హిందీ నగర్, దోమల్ గూడా, గాంధీ నగర్, తట్టిఖానా, సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.