BigTV English

BRS: బీఆర్ఎస్‌కు రాష్ట్ర కార్యదర్శి రాజీనామా.. కేసీఆర్‌కు షాక్..

BRS: బీఆర్ఎస్‌కు రాష్ట్ర కార్యదర్శి రాజీనామా.. కేసీఆర్‌కు షాక్..
kcr brs

BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. BRS రాష్ట్ర కార్యదర్శి మందుల సామేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాదిగలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. 75 ఏళ్ల మాదిగులను మంత్రివర్గంలోకి తీసుకోని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగుల మనోభావాలను కేసీఆర్ దెబ్బతీశారని అన్నారు.


తుంగతుర్తి నియోజకవర్గంలో గురువారం ప్రగతినివేదన సభను బీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సభలో గాదరి కిశోర్‌ను తుంగతుర్తి నుంచి అభ్యర్ధిగా కేటీఆర్ ప్రకటించారు. దీంతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. టికెట్ తనకు వస్తుందని ఆశాభవంతో ఉన్న సామేలు ఒక్కసారి భగ్గుమన్నారు.

గతంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా మందుల సామేలు పని చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన కేసీఆర్ తోనే ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆశించినా టికెట్‌ దక్కలేదు. ఈసారి కూడా టికెట్ రాదని స్పష్టత రావడంతో పార్టీకి రాజీనామా చేశారు. మూడు, నాలుగు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు సామేలు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×