BigTV English

Dental Hygiene: దంతాలను ధృడంగా ఉంచే మాలిక్యూల్.. వ్యాధులకు దూరంగా..

Dental Hygiene: దంతాలను ధృడంగా ఉంచే మాలిక్యూల్.. వ్యాధులకు దూరంగా..

Dental Hygiene: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్.. ఇలాంటి వాటిలాగానే దంత సంబంధిత వ్యాధులు కూడా మానవాళిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యాధులుగా తయారయ్యాయి. ప్లేక్, డెంటల్ క్యావిటీస్ వంటి వ్యాధుల నుండి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు అంటున్నారు. దానికోసమే ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు.


క్యావిటీస్ లాంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి టూథ్‌పేస్ట్, మౌత్ వాష్ లాంటివి ఉపయోగిస్తూనే ఉన్నా కూడా వాటి వల్ల పూర్తిగా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీనికి ఉపయోగపడే మాలిక్యూల్‌ను తాజాగా వారు కనిపెట్టారు. అదే బిసిన్డోల్. ఈ మాలిక్యూల్ అనేది క్యావిటీస్‌ను, ప్లేక్‌ను 90 శాతం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నోటిలో పలు రకాల బ్యాక్టీరియా అనేది ఎప్పటికప్పుడు ఫార్మ్ అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఎస్ మ్యూటెంట్స్ అనే బ్యాక్టీరియా క్యావిటీస్‌కు కారణమవుతుందని తెలిపారు.

ఎస్ మ్యూటెంట్స్ అనేవి మనుషులు తినే ఆహారాన్ని బయోఫిల్మ్ లాగా పళ్ల చుట్టూ ఏర్పడేలా చేస్తాయి. బయోఫిల్మ్ వల్లే క్యావిటీస్, ప్లేక్ లాంటివి ఏర్పడతాయి. అందుకే బిసిండోల్ అనే మాలిక్యూల్.. బయోఫిల్మ్‌ను 90 శాతం వరకు తొలగించి, ఇతర బ్యాక్టీరియాలో నోటిలో ఫార్మ్ అవ్వకుండా చేస్తుంది. సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ముందుగా ఈ బిసిన్డోల్ మాలిక్యూల్‌ను కనిపెట్టారు. దీని సాయంతో టూథ్‌పేస్టులు, మౌత్ వాష్‌లు లాంటివి తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు.


దంతాలను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మనం తినే ఆహారం ద్వారా కూడా దంత సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎలాంటి టూథ్‌పేస్ట్, మౌత్ వాష్‌లు ఉపయోగించినా అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని గుర్తించారు. అందుకే బిసిన్డోల్ అనేది మానవాళికి ఎంతో ఉపయోగపడే మాలిక్యూల్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం వారు ఈ మాలిక్యూల్‌ను డెవలప్ చేసే పనిలో నిమగ్నమయి ఉన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×