BigTV English

Soyam Bapu Rao – Athram Sakku: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో చేరిన సోయం బాపూరావు, ఆత్రం సక్కు

Soyam Bapu Rao – Athram Sakku: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో చేరిన సోయం బాపూరావు, ఆత్రం సక్కు

Soyam Bapu Rao – Athram Sakku: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సిద్ధం అవుతున్నారంట. నాలుగేళ్లు ఆ రెండు పార్టీల్లో ఉన్నా ఒరిగేది ఏమి లేదని.. రాజకీయంగా భవిష్యత్తు ఉండాలంటే పార్టీ మరాల్సిందే అని ఫిక్స్ అయ్యారట… ఇక మొన్నటి వరకు చెరికలపై సైలెంట్ గా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేయడంతో మళ్ళీ చెరికలకు ఊపందుకోనున్నాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. మరి ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా అవ్వడంతో పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంట


ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేరికలపై అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బలమైన నేతలను గుర్తించి కాంగ్రెస్‌లో చేర్చుకునే పనిలో పడ్డారంట. వారిని ఎన్నికలలోపు చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నారంట. బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొని స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లను సాధించడానికి కాంగ్రెస్ స్కెచ్ గీస్తోందంట. వలసలపై అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా అప్రమత్తం అయ్యారంటున్నారు. పార్టీలో ఉంటేనే తగిన అవకాశాలు వస్తాయని పక్క చూపులు చూస్తున్నవారికి వారికి హామీలు ఇస్తున్నారంట. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే క్యాడర్ను సన్నద్ధం చేస్తున్న విపక్షాలు .. సీనియర్ నేతలు వలస వెళ్లకుండా చూసుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయంట

రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తి కాగానే స్థానిక సం స్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలు, ముండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్తులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలపైన దృష్టి పెడతారంటున్నారు. ఇప్పటికే సర్పంచ్‌ల పదవీకాలం పూర్తై పదినెలలు గడిచిపోయింది. ఎంపీటీసీ, జడ్చీ టీసీల పదవీకాలం పూర్తయి ఐదు నెలలు గడిచి పోయింది. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తున్నారు.


జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశముండటంతో అధికార పార్టీ నేతలు వలసలపై దృష్టి పెట్టారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. పంచాయతీల నుంచి మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్తుల్లో బీఆర్ఎస్ ఆధిపత్యమే కొనసాగింది . ఈ దఫా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మరో నాలుగేళ్ల పాటు పదవీ కాలం ఉండటంతో స్థానిక సంస్థలన్నింటిలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామనే ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తుంది.

Also Read: రేవంత్ దెబ్బ.. పరారీలో నామా నాగేశ్వరరావు?

ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలో రిజర్వేషన్లకు అనుగుణంగా సీనియర్ నేతలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ లో దీర్ఘకాలంగా ఉన్న వారితో పాటు ఎన్నికల సమయంలో చేరిన వారిని పోటీలో ఉంచేందుకు ఏర్పా ట్లను చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన సీనియర్ నేతలను గుర్తిస్తూ పార్టీలో చేరాలని కోరుతున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు కలుపుకొని మొత్తం 33 ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలతో పాటు మండలాలకు ఎన్నికలను నిర్వహిస్తారు. వాటిలో మెజార్టీ ఎంపీటీనీలు, జెడ్పీటీసీలను కైవసం చేసుకుంటే మండల అధ్యక్షులతో పాటు జెడీ కూడా తమ పార్టీ చేతుల్లోకి వస్తుందని బావిస్తున్నారు. అన్ని పంచాయతీలు, మండలాల్లో బలమైన నేతలను ఈ దపా పోటీలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీలో చేరే వారికి ఒకవేళ రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశాలు రాకుంటే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చినా నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌కు రెండు సీట్లే దక్కాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు లక్ చిక్కలేదు. అందుకే స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుని వచ్చే ఎన్నికల వాటికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు . బీఆర్ఎస్ లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకునే విధంగా ప్రయత్నాలను కొనసా గిస్తున్నారు. మరో రెండున్నర నెలల్లో మున్సిపాలిటీల కౌన్సిలర్లు.. కార్పొరేటర్ల పదవీకాలం పూర్తవుతుండటంతో వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్‌లోకి వలసలు పెరగకుండా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు క్యాడర్తో మీటింగులు పెట్టుకుంటూ నానా పాట్లు పడుతున్నారు. వఅందరూ కాంగ్రెస్లో చేరితే స్థానికి సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం రాదని పార్టీలో ఉంటేనే రిజర్వేషన్లకు అనుగు ణంగా పోటీ చేసే అవకాశం ఉంటుందని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో మీటింగులు పెట్టుకుండా వారు జారి పోకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఆ క్రమంలో జిల్లాలో ఎవరు ఎప్పుడే పార్టీలో ఉంటారో అంతుపట్టకుండా తయారైందిప్పుడు.

 

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×