ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతున్న వేళ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ కొత్త చర్చకు తెరతీశాయి. రెండున్నరేళ్ల తర్వాత వైసీపీదే అధికారం అంటూ ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. అంబటి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తాను హోంమంత్రి అవుతానంటూ ప్రకటించుకున్నారు. గుంటూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్‌కు వచ్చిన అంబటి.. పోలీసుల ముందే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పోలీసులంతా మంచివాళ్లే కానీ.. ఒక్కరు మాత్రం కాదంటూ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తొలి 6 నెలలు తానే హోంమంత్రిగా ఉంటానంటూ అంబటి చెప్పడం మరింత ఆసక్తిని రేపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై కేసులు నమోదయ్యాయని అంబటి పలుమార్లు ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపై కూడా గతంలో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పోలీసుల ముందే.. భవిష్యత్‌లో తాను హోంమంత్రిగా వస్తానంటూ చెప్పడంతో అంబటి టార్గెట్ ఏంటన్న చర్చ మొదలైంది. ఆ 6 నెలలు టీడీపీ, పోలీసులపై రివేంజ్ తీర్చుకోనున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అయితే.. జగన్ హయాంలో హోంశాఖ విషయంలో ఓ ప్రత్యేకమైన ప్యాటర్న్ కనిపించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సుచరితకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత తానేటి వనితకు హోంశాఖ ఇచ్చారు. అంతకుముందు కూడా మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన ఉదాహరణ ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో హోంశాఖను మహిళకే కేటాయించింది. చంద్రబాబు కేబినెట్‌లో అనితకు హోంమంత్రి బాధ్యతలు దక్కాయి. అంటే.. గత ప్రభుత్వాలు సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని హోంశాఖ కేటాయిస్తూ వచ్చాయి. మరి అంబటి లెక్క ప్రకారం మాత్రం ఈసారి ఆ సమీకరణాలు మారాల్సిందే అన్నట్టుగా ఉంది.
అంబటి చేసిన ఈ ప్రకటనకు జగన్ నుంచి ఏమైనా హామీ ఉందా? లేక అంబటి తన రాజకీయ అంచనాతోనే హోంశాఖపై ముందుగానే కర్చీఫ్ వేశారా? ఇది ఇప్పుడు వైసీపీలోనూ చర్చకు కారణమవుతోంది. వైసీపీ ఓటమి తర్వాత కొంతమంది మాజీ మంత్రులు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కానీ అంబటి మాత్రం కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు-లోకేశ్‌పై తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. అందుకేనేమో.. వైసీపీలో హోమంత్రి పదవికి తనకంటే మించినోళ్లు లేరని.. జగన్ మళ్లీ సీఎం అయితే మొదటి ఆర్నెళ్లు నేనే హోంమంత్రి అని అంబటి డిసైడ్ అయ్యే ఈ విధంగా ప్రకటించుకుంటున్నారని అంటున్నారు. ఇక్కడ చూడండి… గుంటూరు పోలీసులతో అంబటి ఏం చెప్తున్నాడో..! ఇదిగో ఇక్కడ చూడండి… గుంటూరు పోలీసులతో అంబటి ఏం చెప్తున్నాడో..!
Also Read: అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?
మొత్తానికి.. వైసీపీ అధికారంలోకి వస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేయడం ఒక ఎత్తయితే.. అధికారంలోకి రాగానే హోంశాఖ తనకే అన్నట్టుగా మాట్లాడటం మరో ఎత్తు. అంబటి ఆశించినట్టుగానే జగన్ మళ్లీ సీఎం అయితే.. హోంమంత్రి పదవి ఆయనకే ఇస్తారా? లేక వైసీపీ పాత ప్యాటర్న్‌నే కొనసాగిస్తుందా? దీనిపై క్లారిటీ రావాలంటే.. ముందుగా వైసీపీ అధికారంలోకి రావాల్సిందే.