BigTV Exclusive: తనకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు లేవని వరంగల్ కు చెందిన జకారియా తెలిపారు. ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ వద్ద ఎన్ఐఏ అధికారులు వరంగల్ కు చెందిన జకారియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో జకారియాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు మూడు రోజులపాటు విచారణ నిర్వహించారు. ఈ సంధర్భంగా వరంగల్ కు ఉగ్రవాదులతో సంబంధం ఉందని విస్తృత ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలోనే అనంతరం జకారియాను విడుదల చేశారు.
వరంగల్ కు వచ్చిన జకారియాను బిగ్ టీవీ పలకరించింది. ఈ సందర్భంగా జకారియా తన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు విచారణ అనంతరం తనకు నిషేధిత సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఎన్ఐఏ అధికారులు తేల్చారన్నారు. శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, పూర్తిస్థాయి విచారణ జరిపి తనను వదిలివేసినట్లు జకారియా అన్నారు.
Also Read: Rahul Gandhi TG Visit: మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
తనపై ఎలాంటి మచ్చలేదని తెలుసుకున్నాకే వదిలిపెట్టినట్లు, తాను ఉగ్రవాదిని అంటూ ఇష్టానికి వార్తలు ప్రసారం చేయడం తగదన్నారు. ఇటీవల జరిగిన ప్రచారంతో తన కుటుంబం బ్రతికే పరిస్థితులు లేవని, మీడియా సంస్థలు నిజాలను ప్రసారం చేయాల్సిందిగా జకారియా వేడుకున్నారు. ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు.