Toxic : ‘కేజిఎఫ్’ (KGF) ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ (Yash) చేస్తున్న మూవీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic). చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ మూవీని అనౌన్స్ చేశాడు యష్. అత్యంత భారీ బడ్జెట్ తో, ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని జానర్లో ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ మూవీ కోసం షూట్ చేసిన మేజర్ కంటెంట్ రష్ ని మేకర్స్ స్క్రాప్ చేసినట్టు టాక్ నడుస్తోంది. పైగా రీషూట్ కూడా మొదలు పెట్టారని అంటున్నారు.
మేజర్ ఫుటేజ్ మొత్తం స్క్రాప్
యష్ హీరోగా, ప్రముఖ మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ (Toxic). ఈ మూవీ గోవాలో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్. టాక్సిక్’ని కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముంబై పరిసర ప్రాంతాల్లో నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ ను నిర్వహించారు మేకర్స్. అందులో భాగంగా సినిమాలోని పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారు. కానీ ఈ షూటింగ్ కు సంబంధించిన రషెస్ చూసిన తర్వాత యష్ డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకేముంది ఆ మొత్తం ఫుటేజీని స్క్రాప్ చేయమని ఆయన మేకర్స్ ని కోరాడని అంటున్నారు. దీంతో టీం మళ్లీ ఇప్పుడు ఆ స్క్రాప్ చేసిన కంటెంట్ ని రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ఇది ‘టాక్సిక్’ (Toxic) నిర్మాతలకు భారీ నష్టం అని చెప్పాలి. నిజానికి ‘కేజీఎఫ్’ తర్వాత యష్ చేయబోయే నెక్స్ట్ మూవీకి నిర్మాతలు భారీగానే ఖర్చు చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యారు. కానీ ఇలా ఇప్పటిదాకా షూట్ చేసిన మేజర్ ఫుటేజీని స్క్రాప్ చేయడం అంటే బడ్జెట్లో భారీ మొత్తం వృథా అవుతున్నట్టే. అయితే అవుట్ పుట్ విషయంలో యష్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా షూట్ చేసిన ఈ షెడ్యూల్లో కియారా అద్వాని కూడా నటించిందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కర్ణాటకలో జరుగుతుంది. ‘టాక్సిక్’ మూవీని ముందుగా వేసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అన్నీ అనుకున్నట్టుగా జరగకపోవడంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
నయనతార గురించి హింట్ ఇచ్చిన యాక్టర్
‘టాక్సిక్’ (Toxic) సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఒబెరాయ్ విలన్ రోల్ పోషించబోతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తోంది అని హింట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ విషయంపై డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని ఆయన వెల్లడించారు. ఇక ఇందులో మరో హీరోయిన్ గా నటిస్తున్న కియారా ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసింది.