Bird Flu : చికెన్ వర్సెస్ బర్డ్ ఫ్లూ. నెల రోజులుగా టెన్షన్ టెన్షన్. మొదట్లో ఏపీలో బర్డ్ ఫ్లూ బయటపడింది. తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. గోదావరి జిల్లాలు బెదిరిపోయాయి. లక్షలాది కోళ్లను చంపేసి పూడ్చేశారు. మీడియాలో ఆ న్యూస్ చూసి.. భయపడిపోయారు. ముక్కలు తినడం తగ్గించేశారు. చికెన్ రేట్ కూడా దిగొచ్చింది. మటన్ డిమాండ్ మాత్రం పెరిగిపోయింది. ఇదంతా నెల క్రితం మేటర్. ఆ తర్వాత బర్డ్ ఫ్లూ న్యూస్ తగ్గుముఖం పట్టింది. రేటు కూడా కాస్త తగ్గడంతో.. మళ్లీ చికెన్ లవర్స్ ఓ పట్టు పడుతున్నారు. దొరికిందే ఛాన్స్.. ధర తగ్గినప్పుడే తినాలంటూ చికెన్ తినడం పెంచేశారు. ఇలా తెగ ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో.. మళ్లీ బర్డ్ ఫ్లూ బాంబ్ మీద పడింది. ఈసారి తెలంగాణలో.
సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ..
సిద్దిపేట జిల్లా కాన్గల్‌లో బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది. ఆ పిల్లోడు చనిపోయాడని సమాచారం. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్‌ను సీజ్ చేశారు. ఇప్పటికే 20 వేలకు పైగా కోళ్లు చనిపోగా.. మిగిలిన 50 వేల కోళ్లను చంపి పాతిపెడుతున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్టెడ్ ఏరియాకు చుట్టు పక్కల ఉన్న ఫామ్స్‌లోని కోళ్లను సైతం చంపేయాలని ఆదేశించారు. కాన్గల్ కోళ్ల ఫామ్‌లో పని చేస్తున్న సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి.. రాకపోకలు కంట్రోల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ పై 20 టీమ్‌లు పని చేస్తున్నాయి.
హైదరాబాదీలు అలర్ట్!
సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ కదా.. మనకేం అవుతుందిలే అని మిగతా జిల్లాల వాళ్లు లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అది బర్డ్ ఫ్లూ. ఎక్కడినుంచి ఎక్కడికైనా వేగంగా వ్యాప్తి చెందొచ్చు. నెల క్రితం ఆంధ్రాలో కనిపించింది. అక్కడ చావు డప్పు మోగించింది. ఇప్పుడు సిద్దిపేటలో ఎంటర్ అయింది. తెలంగాణను వణికిస్తోంది. సిద్దిపేటకు, హైదరాబాద్‌కు రెగ్యులర్ రాకపోకలు ఉంటాయి. ఏ కోడో. ఏ కోడి కూర తిన్నవాళ్లో.. అటూఇటూ షిఫ్ట్ అయితే..? ఇక అంతే సంగతి. వన్స్ హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ ఎంటర్ అయితే..? కోటి జనాభా ఉన్న నగరమాయే. మామూలుగా ఉండదు ఇంపాక్ట్. ఇదే అంశం ఇప్పుడు అధికారులను, ప్రజలకు కలవరపడుతోంది.
Also Read : బీఆర్ఎస్‌లో డర్టీ లీడర్.. సహజీవనం చేసి, కొడుకు పుట్టాక..
తెలంగాణలో జర జాగ్రత్త..
ఎప్పుడూ తినే చికెనేగా. ఇప్పుడు కూడా తినాలని చూడకండి. కాస్త కంట్రోల్డ్‌గా ఉండండి. ఓ వారం తినకపోతే ఏం కాదు. తింటేనే ఏమైనా అవుతుంది. పోయినా పోతారు. బర్డ్ ఫ్లూ డేంజర్. సోకితే ఖతం. ఒక్క కోడి చాలు.. మొత్తం చుట్టేయడానికి. అధికారులు సిద్దిపేట జిల్లా కాన్గల్‌ను ఇప్పటికే కట్టడిముట్టడి చేశారు. మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ, ఇలాంటి వైరస్‌లను అదుపు చేయడం అంత ఈజీ కాదు. కరోనాను చూశాంగా ఎలా రెచ్చిపోయిందో. అందుకే, బర్డ్ ఫ్లూ తోనూ బీ కేర్‌ఫుల్. మరీ భయపెట్టాలని కాదుకానీ.. నోరు కాస్త కట్టేసుకుని.. చికెన్‌కు కొన్ని రోజులు దూరంగా ఉంటే బెటర్. తినకుండా ఉండలేం.. మేం తింటాం.. అంటే మీ ఇష్టం. ప్రస్తుతానికైతే కాన్గల్ వరకే రెడ్ అలర్ట్. మన వరకూ రానంత వరకూ ఓకే కానీ.. జర జాగ్రత్త.