BRS : ‘కామా తురాణం న భయం న లజ్జ’.. అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి భయం, లజ్జ లాంటివేవీ ఉండవు అని. చాలామంది ఇలా కామంతో కొట్టుకుపోతుంటారు. సొసైటీలో పెద్ద మనుషులుగా చెలామని అయ్యే వారూ ఇందుకు మినహాయింపు కాదు. రాజకీయ నాయకులు సైతం ఈ లిస్ట్‌లో ముందుంటారు. తెల్లబట్టలు వేసుకుని ఉదయమే రోడ్డెక్కుతారు. రోజంతా జనాల మధ్యే తిరుగుతుంటారు. చీకటయ్యాక కానీ కొందరి అసలు యవ్వారం మొదలవదు. లీడర్ కదా.. ఆయనకు క్లోజ్‌గా ఉంటే తమకూ పరపతి పెరుగుతుందని చాలా మంది చోటామోటా నాయకుల చెంతకు చేరుతారు. అందులో మహిళా నేతలూ ఉంటారు. ఒకానొక వీక్ టైమ్‌లో వాళ్లు కనెక్ట్ అయిపోతారు. ఇక అంతే. రెగ్యులర్ దుకాణం ఓపెన్ చేసేస్తారు. అక్రమ సంబంధం నడిపిస్తుంటారు. ఎవరికీ తెలీకుండా జాగ్రత్త పడేవాళ్లు కొందరైతే.. పిల్లల్ని కనే వరకూ తెగబడే వాళ్లు మరికొందరు. అలాంటి రాసలీలల బీఆర్ఎస్ నాయకుడి ఉదంతమే ఇది.
గులాబీ లీడర్ గలీజ్ బాగోతం
కామారెడ్డి జిల్లాకు చెందిన BRS నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి. అప్పటికే అతనికి పెళ్లి అయింది. అయితేనేం.. భార్య ఉంటే మరొకరితో ఉండకూడదా? అనుకున్నాడు. రాజంపేటకు చెందిన రాజమ్మను లైన్లో పెట్టాడు. మాయమాటలు చెప్పాడు. నేనో పెద్ద లీడర్ అంటూ ఫోజులు కొట్టాడు. అతడి ట్రాప్‌లో రాజమ్మ ఈజీగా పడిపోయింది. ఆమెతో చాలాకాలం సహజీవవం చేశాడు. వారి అక్రమ సంసారానికి గుర్తుగా ఓ కొడుకు కూడా పుట్టాడు. అతన్ని స్కూళ్లో కూడా వేశాడు. ఇంటిపేరు, తండ్రి పేరు అంతా తనదే. ఆధార్, రేషన్ కార్డు, స్కూల్ అడ్మిషన్‌లో తండ్రిగా మోహన్‌రెడ్డి పేరే ఉంది. అప్పటి వరకూ హ్యాపీగా సాగిన ఆ సహజీవనం ఒక్కసారిగా బెడిసికొట్టింది. బీఆర్ఎస్ అధికారం పోయాక మోహన్‌రెడ్డి తీరు మారింది.
Also Read : HCUపై తప్పుడు ట్వీట్లు మాయం.. అడ్డంగా దొరికిపోతున్న ఫేక్ గాళ్లు..
రోడ్డెక్కిన చాటుమాటు యవ్వారం
పుష్ప సినిమాలో మాదిరిగా.. స్కూల్లో ఇన్నాళ్లూ ఆ పిల్లాడి తండ్రిగా ఉన్న తన పేరును తీసేయించాడు. మోహన్‌రెడ్డికి బదులు శివరాములు అని నమోదు చేయించాడు. ఇంటి పేరు కూడా మార్పించాడు. స్కూళ్లోనే కాదు ఎక్కడా ఫాదర్ నేమ్ కాలమ్‌లో తన పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇవన్నీ ఇన్నాళ్లూ మోహన్‌రెడ్డితో సహజీవనం చేసిన అంజమ్మ చేసిన ఆరోపణలు. తనకు తీరని అన్యాయం చేశాడని.. న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టనంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసింది. ఇన్నాళ్లూ చాటుగా సాగిన ఆ యవ్వారం.. అంజమ్మ ఎదురు తిరగడంతో ఇప్పుడు రోడ్డున పడింది ఆ బాగోతం. బీఆర్ఎస్ లీడర్ జూకంటి మోహన్‌రెడ్డి ఉదంతం కామారెడ్డిలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగానూ రచ్చ రేపుతోంది.