BJP Leader Clean Temple After Dalit performs pooja | ఓ దళిత నాయకుడు దేవాలయంలో ప్రేవేశించాడని తెలిసి స్థానిక బిజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడి ప్రవేశంతో ఆలయం అపవిత్రమైందని చెబుతూ వెంటనే గంగాజాలంతో ఆలయం శుద్ధి చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన రాజకీయం దుమారం రేపింది. దళితుడి ప్రవేశంతో ఆలయం అపవిత్రమైందని చెబుతూ వెంటనే గంగాజాలంతో ఆలయం శుద్ధి చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన రాజకీయం దుమారం రేపింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే టికా రామ్ జుల్లీ ఇటీవల ఓ రామాలయాన్ని సందర్శించారు. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా అల్వార్‌లోని శ్రీరామ చంద్ర ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత జ్ఞాన్‌దేవ్ అహుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే రాకతో ఆలయం అపవిత్రమైందని ఆరోపించారు. వెంటనే ఆలయాన్ని శుద్ధి చేయాలని చెబుతూ గంగాజలం తీసుకువచ్చారు.
ఆ గంగాజలాన్ని దేవతల విగ్రహాలపై చల్లి, తరువాత ఆలయ ప్రాంగణం మొత్తం చల్లారు. అలా చేసిన తరువాత ఆలయం శుద్ధి అయిందని ప్రకటించారు. ఈ ఘటన మొత్తం వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అహుజా చర్యను చూసి బీజేపీ దళితుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. దళితులను అవమానించడం, అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తున్న బిజేపీ.. దళితులను ద్వేషిస్తోందని ఆరోపించారు. దళితులు పూజలు చేయడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని వారు పేర్కొన్నారు.
Also Read: 2 భర్తలు, 3 పిల్లలు.. మైనర్ ప్రేమికుడి కోసం హిందూ మతం స్వీకరించిన ముస్లిం యువతి
కాంగ్రెస్ దళిత నేత టికా రామ్ జుల్లీ ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ల ప్రస్తుతం మూడోసారి శాసనసభ సభ్యుడిగా విజయం సాధించారు. అయితే ఆయన పట్ల బిజేపీ నేత జ్ఞాన్‌దేవ్ అహుజా ప్రవర్తించారు. దేవాలయం అపవిత్రమైందని భావించిన అహుజాను స్థానిక మీడియా సంప్రదించగా.. తాను చేసిన పనిపై జ్ఞాన్‌దేవ్ అహుజా స్పందించారు. ‘‘నాకు టికా రామ్‌పై ఎలాంటి ద్వేషం లేదు. నాకు దళితులపై కోపం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీపై నాకు అభ్యంతరం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘రామసేతు అసలే లేదని, అది కేవలం హిందువుల కల్పన అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అలా ఉంటే అలాంటి నేతలు ఆలయాలకు ఎందుకు రావాలనే ప్రశ్న తలెత్తు తుంది.’’ అని అహుజా తన చర్యలను సమర్థించుకున్నారు.
మరోవైపు ఆయన చర్యలను లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. “ఈ ఘటన బిజేపీ దళితుల వ్యతిరేకి అని నిరూపించింది. కానీ ఈ దేశం రాజ్యాంగం విలువలపై నడుస్తుంది. దళితులు, అణగారిన వర్గాలను తక్కువగా చూసే మనుస్మృతి ఆధారంగా కాదు. బిజేపీ అధిష్ఠానం ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలి.” అని రాహుల్ గాంధీ విమర్శించారు.
అయితే బిజేపీ అధిష్ఠానం జ్ఞాన్‌దేవ్ అహుజాను సస్పెండ్ చేసింది. రాజస్థాన్ సీనియర్ బిజేపీ నేత దామోదర్ అగర్వార్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బిజేపీ సిద్ధాంతాలను అహుజా ఉల్లంఘించినట్లు షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.