BigTV English

Manchu Vishnu vs Manoj: మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ నిరసన.. మళ్లీ మొదలైందిగా మంచు వార్!

Manchu Vishnu vs Manoj: మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ నిరసన.. మళ్లీ మొదలైందిగా మంచు వార్!

Manchu Vishnu vs Manoj:మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి. జల్పల్లి నివాసంలో మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గరికి భారీగా పోలీసులు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్, మోహన్ బాబు, విష్ణులకి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఈరోజు మనోజ్ జల్పల్లి లోని మోహన్ బాబు ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. మోహన్ బాబు లతో మాట్లాడాలని ప్రయత్నించిన ఆయన మాట్లాడడం లేదని మనోజ్ చెప్తున్నాడు. ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు కోర్టు నాకు అనుమతి ఇచ్చిందని చెప్తూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి ముందే కూర్చొని నిరసన తెలుపుతున్నాడు. అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా, పోలీసులు ముందస్తు జాగ్రత్త చేపట్టారు.


పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్.. 

మనోజ్, మోహన్ బాబు ఇంటి వద్దకు వస్తున్నాడనే సమాచారం ముందుగానే పోలీసులకు తెలియడంతో.. వందమంది పోలీస్ లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. బయట వ్యక్తులు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తన ఇంట్లో లేనప్పుడు తన వస్తువులను తీసుకువెళ్లారని, నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వస్తువులతో పాటు తన కారుని కూడా ఎవరో తీసుకువెళ్లారని పోలీసులకు మంచి మనోజ్ డ్రైవర్ సాంబశివరావు ఫిర్యాదు చేశాడు. రాజేంద్రనగర్ సమీపంలో మంచు మనోజ్ కారును పోలీసులు గుర్తించారు. ఆ కారుని, పోలీసులు స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇదంతా ఎవరు చేశారనేది దర్యాప్తులో తెలుస్తుందని పోలీసులు తెలుపుతున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు.


మనోజ్ ఆవేదన ..

మంచు మనోజ్ బాధపడుతూ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ ఒకటవ తేదీన మా పాప పుట్టినరోజు కోసం మేము జైపూర్ వెళ్ళాము అదే రోజు నా ఇంట్లో విధ్వంసం చేశారు. ఈ గొడవలన్నీ కావాలనే చేస్తున్నారు. ఫ్యామిలీ గొడవలు గా మార్చి పిచ్చోళ్ళని చేస్తున్నారు. మాది ఆస్తి గొడవ కాదు స్టూడెంట్స్ విషయంలో స్టార్ట్ అయిన గొడవ ఇది. మా ఇంట్లో జరిగిన బీభత్సం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండటం లేదు కదా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇన్స్పెక్టర్ పహారడి షరీఫ్ ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్ లైన ఒక్క చార్జిషీట్ ఫైల్ చేయలేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నా కూడా ఛార్జ్ ఫైల్ చేయడం లేదు. నేను ఊరిలో ఉన్నప్పుడు నన్ను ఏమీ చేయడం చేతకాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లాన్ చేసి ఇల్లు ధ్వంసం చేశాడు.మా డ్రైవర్ భోజనం చేసే సమయం లో కార్ ను దొగలించి, రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలేసారు. ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు కేసు నమోదు చేయడం లేదు.

నాతో ఆడవేషం వేయించి వాడుకున్నారు ..

మా అన్న విష్ణు సినిమా ‘కన్నప్ప’ పోటీగా ‘భైరవ’ సినిమా నేను రిలీజ్ చేస్తున్నానని నా మీద కోపంతో ఇదంతా చేస్తున్నారు. కూర్చొని మాట్లాడదాం అని అడుగుతున్నా విష్ణు ముందుకు రావట్లేదు. హైకోర్టు నుండి నాకు ఆదేశాలు వచ్చాయి నా ఇంట్లో నేను ఉండొచ్చు. కానీ వీళ్లు కోర్ట్ ను తప్పుదోవ పట్టించి కింద కోర్టులో ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. మా ఇంట్లోకి వెళ్లడానికి నాకు అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ పోలీసులు అనుమతించడం లేదు. నా కుటుంబం నుండి ఒక రూపాయి తీసుకోలేదు. విష్ణు కెరియర్ కోసం నాతో అమ్మాయి వేషం వేయించారు. సీఎంని, డిప్యూటీ సీఎంలని, అడుగుతున్నా నాకు న్యాయం చేయమని. నా జుట్టు విష్ణు చేతిలోకి వెళ్లాలి అన్నది అతని లక్ష్యం. క్యాంపస్ లో జరుగుతున్న అక్రమాలు విష్ణు దొంగతనాలు గురించి ప్రశ్నించినందుకే, నా మీద ఇంత కక్ష కట్టారు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు కర్మ అనుభవించి తీరుతారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×