BigTV English

B’Day Celebrations in Operation Theatre: రోగులను గాలికొదిలేసి బర్త్ డే వేడుకలు.. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే డీజే!

B’Day Celebrations in Operation Theatre: రోగులను గాలికొదిలేసి బర్త్ డే వేడుకలు.. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే డీజే!


Birthday Celebrations in Government Hospital Operation Theatre: ఇటీవల కాలంలో ప్రజలకు సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని వింత చేష్టలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వైరల్ కావడమే లక్ష్యంగా పెట్టుకుని ఎంతకైనా తెగిస్తున్నారు.

వైరల్ కావడం కోసమే కొందరు కావాలని వింత చేష్టలు చేస్తూ.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. మరి కొందరు ఒకటి, రెండు వీడియోలకే వైరల్ అయిపోతుంటారు. ఇలా వైరల్ అవ్వాలనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో అనేక విమర్శలకు దారి తీసింది.


మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆపరేషన్ థియేటర్‌ను బర్త్ డే వేడుకలకు వేదికగా మార్చారు అక్కడి సిబ్బంది. డిప్యూటీ డీఎంహెచ్‌వో (DMHO) మురళీధర్ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. మార్చి 2న ఆయన బర్త్ డే సందర్భంగా అక్కడి సిబ్బంది పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఉన్న అన్ని గదులకు తాళాలు వేసి ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లో ఆట, పాటలతో బర్త్ డే పార్టీ చేసుకున్నారు.

Read More: తెలంగాణ ప్రజలూ..ఈ 5 రోజులు జాగ్రత్త.. హెచ్చరించిన వాతావరణశాఖ

ప్రభుత్వ ఆస్పత్రి ముందు డీఎంహెచ్‌ఓ ఫొటోలతో భారీ ఫ్లెక్సీ కట్టారు. ఆపరేషన్ థియేటర్‌లో కేక్ కట్ చేసి, డీజే బాక్స్‌లు పెట్టి గోల గోల చేశారు. ఆస్పత్రిలో ఉన్న రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సిబ్బంది బిర్యానీతో పాటు మద్యం కూడా సేవించారు. ఇదంతా పార్టీలో పాల్గొన్న సిబ్బంది.. తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆస్పత్రి సిబ్బంది చేసిన బర్త్ డే వేడుకల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులను పట్టించుకోకుండా పార్టీలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న DMHOతో పాటు అక్కడ ఉన్న సిబ్బందిని వెంటనే విధుల్లో నుంచి తొలంగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×