Fruits For Immunity: వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. COVID-19 సమయంలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటాము అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ పెంచుకోవడానికి ఏ విధమైన ఫ్రూట్స్ తినాలనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ:
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వాటిలో అధిక స్థాయిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నారింజలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.
ఉసిరి:
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ఐరన్ , ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి రక్తహీనతను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
బొప్పాయి:
బొప్పాయిలలో విటమిన్లు ఎ , సి, నియాసిన్, మెగ్నీషియం, కెరోటిన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, రాగి, కాల్షియం వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి . అంతే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి.
బెల్ పెప్పర్:
బెల్ పెప్పర్లలో విటమిన్లు సి, ఎ , ఇ, ఖనిజాలు , పొటాషియంతో పాటు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . అంతే కాకుండా వివిధ వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి.
నిమ్మకాయ:
నిమ్మకాయలలో విటమిన్లు ఎ , సి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా ఇవి శరీరం యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా సహాయపడతాయి. నిమ్మకాయలలోని సిట్రిక్ ఆమ్లం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కిడ్నీ రాళ్లు ఉన్న వారు కూడా నిమ్మను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: క్యాన్సర్ కాదు.. అత్యధిక భారతీయులను చంపేస్తున్న భయానక వ్యాధి ఇదే, మీరూ జర భద్రం!
జామ:
జామపండ్లు ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, లైకోపీన్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. జామలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామ వ్యాధినిరోధక శక్తిని పెంచి క్యాన్సర్లను కూడా తగ్గిస్తుంది. జామలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కర్వీతో పాటు అనేక వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. జామ పండు తినే వారి యొక్క మెదడు కూడా చురుగ్గా ఉంటుంది.