BJP Big Sketch : ఫాంహౌజ్ లో అడ్డంగా బుక్కయ్యారు. ముగ్గురు మధ్యవర్తులు పోలీసులకు చిక్కారు. బీజేపీ 100 కోట్ల వల అంటూ టీఆర్ఎస్ ఆరోపణ. అందుకు తగ్గట్టే పలు ఫోన్ ఆడియోలు లీక్ చేశారు. అయినా, బీజేపీ నేతలు అదరడం లేదు.. బెదరడం లేదు. అసలేమాత్రం డిఫెన్స్ లో పడటం లేదు. అదెలా సాధ్యం? పైగా దూకుడుగా ఉంటున్నారు. బండి సంజయ్ యాదాద్రి గుడిలో ప్రమాణం చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈడీకి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు జడ్జి, సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. కమలనాథులు ఇంత ధీమాగా ఉండటానికి కారణం ఏంటి?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడంలో రాష్ట్ర బీజేపీకి అసలేమాత్రం సంబంధం లేకపోవడమే వారి కాన్ఫిడెన్స్ కు కారణం అంటున్నారు. అందుకు తగ్గట్టే.. లీక్ అయిన ఆడియోలు అంతా ఢిల్లీ నుంచే జరుగుతున్నట్టు తెలిసిపోతోంది. రామచంద్రభారతి, సోమయాజులు, నంద కుమార్ లు మాట్లాడుతున్న ఆడియో-2లో ఆసక్తికర విషయాలు వినిపించాయి.
ఎమ్మెల్యేల డీల్ విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి చేతిలో ఏమీ లేదంటూ.. స్టేట్ ని బైపాస్ చేసి సెంటరే నేరుగా డీల్ చేస్తోందంటూ రామచంద్రభారతి అనడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఎమ్మెల్యేల చేరిక కన్ఫామ్ అయితే తాను సంతోష్ తో, అమిత్ షాతో మాట్లాడతానన్నారు రామచంద్రభారతి. ఆ సంభాషణ ప్రకారం.. టోటల్ ఎపిసోడ్ లో ఎక్కడా.. స్టేట్ బీజేపీ నేతల రోల్ లేదని.. స్కెచ్ అంతా ఢిల్లీ డైరెక్షన్ లో రామచంద్రభారతి నేతృత్వంలో జరిగినట్టు అనిపిస్తోంది. అందుకే, తెలంగాణ బీజేపీ నేతలు తమకేం సంబంధం లేదనేలా ఫుల్ కాన్ఫిడెంట్ గా, దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.