Gundeninda GudiGantalu Today episode November 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను ఇంటిలోకి తీసుకొచ్చిన సత్యం తో తన బాధను చెప్పుకుంటుంది మీనా. తన తప్పు ఏమి లేదని కేవలం సాక్షి సంతకం కోసమే తీసికెళ్లారు అని కాళ్ళమీద పడి ఎమోషనల్ అవుతుంది. సత్యం క్షమించిన ఇంట్లో వాళ్ళు మాత్రం అందరు తలా ఒక మాట అనేస్తారు. దానికి మీనా ఫీల్ అవుతుంది. సత్యం కూడా నాకు అపద్దం చెప్తావా.. అదే బాధగా ఉందని అంటాడు. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగవని చెప్తుంది. లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక బాలు ఇంట్లోకి వచ్చిన మీనాను క్షమించమని అడిగినా మాటలతో మనసు బాధ పడేలా చేస్తారు..ఆ నాన్న కోసం తీసుకొచ్చానని చెప్పడంతో మీనా ఇలానే ఉంటారా? ఇక జీవితాంతం ఇంతేనా అంటుంది.. ఇక ఉదయం లేవగానే అన్ని పనులను చకచకా చేస్తుంది మీనా.. అంతేకాదు టిఫిన్ రెడీ అయ్యిందనీ తినమని సత్యంను అడుగుతుంది. రోహిణి, ప్రభావతి లు కిందకు వస్తారు. ఈ మహా తల్లి రావడం మంచి పనైంది.. బండెడు చాకిరీ నాకు తగ్గింది అనేసి ప్రభావతి అంటుంది. దానికి రోహిణి కూడా అవును నిజమే అంటుంది. ఇక మీ కూతురు లాంటి కోడలు టిఫిన్ చేసింది వెళ్లి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకుని ప్రభావతి అంటుంది. అప్పుడు రోహిణి కూడా టైం కి తిని టైం కి టాబ్లెట్ వేసుకోవాలి మావయ్య అని అంటుంది. పూరి కుర్మా చేసిందని ప్రభావతి అనగానే పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఆ మీనా అనేసి రోహిణి అంటుంది. నీ ఆయిల్ ఫుడ్ వల్లే మామయ్యకు హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అంటుంది. నేను మామయ్య కోసం ఇడ్లీ చేశాను అనగానే ప్రభావతికి రోహిణికి కౌంటర్లు వేస్తాడు సత్యం.. ఏరోజైనా భర్తలను చూసుకోవాలని అనుకున్నారా? ఇది ఇలా చేసి పెడితే ప్రేమగా ఉంటారు. అని సత్యం అనగానే అందరు కుళ్ళుకుంటారు.
పూరి అంటే ఆయనకు ఇష్టం కదా అందుకే చేశాను అని మీనా అంటుంది.. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. నాకు ఇష్టమైనవి చేసిపెట్టమని నిన్ను అడిగానా అంటూ మీనాపై బాలు ఫైర్ అవుతాడు. చేసిన తప్పను మర్చిపోవాలని నిన్ను కూల్ చేయడానికి ఇవన్నీ చేస్తుందని మీనాపై చాడీలు చెబుతుంది ప్రభావతి. నువ్వు అందరికంటే ముదురు అన్న సంగతి మీ ఆవిడకు అర్థం కావడం లేదని ప్రభావతి అంటుంది. నాకు పూరి అంటే ఇష్టమే కానీ నీ చేతి తో చేసిన పూరి మాత్రం తిననని బాలు అంటాడు. ఇక ఆ వడ్డీ వ్యాపారి మాత్రం వడ్డీ కట్టలేదని పీడిస్తున్నాడు అని అంటాడు. వాడు ఏదో అన్నాడని వెనుక ముందు ఆలోచించకుండా కాలర్ పట్టుకున్నావని, ఇప్పుడు డబ్బుల కోసం చూస్తున్నావా అంటాడు. ఇక కారు కొన్న వ్యక్తి డాక్యు మెంట్స్ కోసం వస్తాడు తీసుకొని వెళ్తాడు.
ఇక పార్వతి ఫోన్ చేస్తే వెళ్లి మాట్లాడుతుంది. ఇక్కడి విషయాలు అక్కడికి చేర వేస్తున్నావా అంటూ కోడలిపై కోప్పడుతుంది. నువ్వు మీ అమ్మ కొంపలు కూల్చడంలో ఎక్స్‌పర్ట్ అంటూ అవమానిస్తుంది.రవిని ఇంటి నుంచి పంపించావు. మనోజ్, రోహిణి మధ్య గొడవలు సృష్టించి ఈ ఇంటిని మహారాణిలా ఎలాలని చూస్తున్న నీ కుట్రలు నేను ఉండగా ఫలించవని మీనాతో అంటుంది ప్రభావతి. మళ్లీ నిన్ను ఇంటి నుంచి వెళ్ల గొట్టే రోజు తప్పకుండా వస్తుందని, ఎందుకైనా మంచిది మూటముల్లే సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రోజు టిఫిన్ ఏం చేస్తున్నావని మీనాను ప్రభావతి అడుగుతుంది. పూరి అనగానే వద్దు అంటుంది.
ఇక అందరు టిఫిన్ చేస్తూ ఉండగా కొరియర్ బాయ్ రూపంలో రోహిణి శత్రువు ఇంటికొస్తాడు. అతడిని చూసి రోహిణి కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతిని రోహిణి ఇంట్లోకి పంపిస్తుంది. ప్రభావతి ఇంట్లోకి వెళ్లగానే తనకు డబ్బు కావాలని రోహిణిని అతడు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన దగ్గర డబ్బు లేదని రోహిణి అంటుంది. నా దగ్గర నీ రహస్యం ఉంది అని చెబుతాడు. రోహిణిని కళ్యాణి అని పిలుస్తాడు. వారి మాటల్ని మొత్తం మీనా వినిందని రోహిణి షాక్ అవుతుంది. అత్తయ్య తో కొరియర్ సంగతి చెప్పేస్తుంది. రోహిణి ఏదోకటి చేసి కవర్ చేసుకుంటుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..