Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తెలంగాణకు రానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలకాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. కాగా ఇప్పటికే ఈ గ్రౌండ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, ముఖ్య నేతలు పరిశీలించారు.
ఇదిలా ఉండగా నితిన్ నబీన్ పర్యటన బీజేపీ తెలంగాణకు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుందని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా, సంస్థాగత సంకల్పాన్ని బలోపేతం చేసి, ప్రజలతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేయనుందని రాష్ట్ర నాయకత్వం ధీమాతో ఉంది. మహబూబ్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, అలాగే బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యకర్తల సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి చేసింది.
Also Read: Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు.. నేడు కడియంపై అనర్హత పిటిషన్ పై విచారణ!
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు మహబూబ్‌నగర్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొంటారు. మహబూబ్ నగర్ నుంచి సాయంత్రం 5:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు.
Also Read: Jana Sena And BJP: మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ.. పవన్‌తో కమలనాథుల చర్చలు సఫలం!