BigTV English

Bellamkonda Srinivas:- ఛత్రపతి గెలుస్తాడా.. రాజమౌళి పరువు తీస్తాడా..!

Bellamkonda Srinivas:- ఛత్రపతి గెలుస్తాడా.. రాజమౌళి పరువు తీస్తాడా..!


Bellamkonda Srinivas:- ఏ మాటకు ఆ మాట బెల్లంకొండ శ్రీనివాస్‌పై హిందీ ఆడియెన్స్‌లో చాలా మంచి ఒపీనియన్ ఉంది. బెల్లంకొండ అంటే క్రేజ్ కూడా ఉంది. ఒక్క హిందీ సినిమా కూడా చేయకుండానే అలా ఎలా క్రేజ్ సంపాదించాడనే డౌట్ అక్కర్లేదు. యూట్యూబ్ ఉందిగా. ఓటీటీల ట్రెండ్ రాకముందు.. రికార్డులన్నీ చూసింది యూట్యూబ్ వ్యూస్‌ని బట్టే. యూట్యూబ్‌లో బెల్లంకొండ సినిమాలు ఓ ట్రేడ్ మార్క్ సెట్ చేశాయి. దీనికి కారణం బెల్లంకొండ కూడా కాదు.. డైరెక్టర్ బోయపాటి. జయ జానకి నాయక సినిమాను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే తెగ చూసేశారు జనం. ఆ తరువాత రాక్షసుడు సినిమాను కూడా బాగా ఆదరించారు. మెయిన్‌గా బెల్లంకొండ ఫైట్స్‌కి హిందీ బెల్ట్ మొత్తం ఫిదా అయింది. అందుకే, తేజ డైరెక్షన్లో వచ్చిన సీత సినిమాను హిందీ ఆడియన్స్ అస్సలు పట్టించుకోలేదు. అందులో, ఏమంత ఫైట్స్ లేవు.

ఇప్పుడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అందుకే, ట్రైలర్ చూడండి… మొత్తం ఫైట్ సీన్లతో నింపేశారు. పైగా క్రేజ్ తీసుకురావడానికి తల్లి క్యారెక్టర్లో భాగ్యశ్రీని, కమెడియన్ జానీ లివర్‌ను పెట్టారు. బెల్లంకొండ ఫైట్స్ చూసేందుకైనా జనం థియేటర్లకు వస్తారనేది ఓ అంచనా. అయితే, థియేటర్లకు రప్పించగల అసలు కారణం మాత్రం రాజమౌళి సినిమా బ్రాండ్. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ మూవీని రీమేక్ చేశారంట అనే టాక్.. ఈ సినిమాకు కొంత హైప్ తీసుకొస్తోంది. మరీ రాజమౌళి, ప్రశాంత్ నీల్ అంత కాకపోయినా… వివినాయక్ కూడా మంచి ఫైట్ కంపోజర్. అంటే.. ఆ టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని అర్థం. సుమోలను నేలలోంచి గాల్లోకి లేపడంలో దిట్ట. మరి ఈ సినిమాలో ఎలాంటి ఫైట్స్ కంపోజ్ చేయించాడో చూడాలి. పైగా రీమేక్ చేసినా సరే.. ఒరిజినల్ సినిమాలోని సోల, ఫీల్‌ను తీసుకురాగలడు వివినాయక్. ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్.


ఏదేమైనా.. రియల్ ఛత్రపతి రేంజ్‌లో పర్ఫామెన్స్ ఉంటే ఓకే. కాని, సోసోగా సాదాసీదాగా చేస్తే మాత్రం రాజమౌళి పరువు తీసినట్టే. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఇప్పటికే, ట్రైలర్ చూసి రెండు సినిమాల మధ్య పోలిక తీసుకొస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాను సెలక్ట్ చేసుకొని, బెల్లంకొండ తప్పు చేశాడని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల నోటికి తాళం పడాలంటే.. వివినాయక్ మ్యాజిక్ మీదే ఆధారపడి ఉంది. మరి సినిమాను హిట్ చేసి రాజమౌళి, తెలుగు సినిమా పరువు నిలబెడతాడో లేదో చూడాలి. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×