Hyderabad City: హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు మంచి నీళ్లు బంద్ కానున్నాయి. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటలకు మంచినీళ్ల సరఫరా నిలిచిపోనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు స్వయంగా వెల్లడించారు. ముందుగా ఆ ప్రాంతాల ప్రజలు వాటర్ జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఎల్‌నినో ఎఫెక్టు కారణంగా హైదరాబాద్ సిటీకి మంచి నీటి సమస్య రాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు జలమండలి అధికారులు. దీనికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. గోదావరి జలాల తరలింపుకు ట్రయల్ రన్ చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల సమస్యలపై ఫోకస్ చేశారు. హైదరాబాద్ సిటీలోని సురారం-సాయిబాబా నగర్ వార్డులతోపాటు కొన్ని ప్రాంతాల్లో 24 గంటలపాటు మంచినీళ్లు బంద్ కానున్నాయి.
శనివారం అనగా నవంబర్ 21 రాత్రి 9 గంటల నుండి ఆదివారం రాత్రి 9 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అందులో విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీ నగర్, సూరారం, తెలుగు తల్లి నగర్, జైభీమ్ నగర్, మైత్రి నగర్, సూరారం కాలనీలపై వాటి ప్రభావం పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది. మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది.
ఈ క్రమంలో ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచన చేసింది. ముఖ్యంగా సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనుల కోసం తాగునీటి పైప్‌లైన్లను మారుస్తున్నారు. ఈ క్రమంలో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేయనున్నారు. సూరారం చెరువు నుంచి 14 ఎంఎల్‌డీ ఎస్టీపీ వరకు చేపట్టిన ఆయా పైప్‌లైన్ నిర్మాణ పనులు దాదాపు 95 శాతం జరిగాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 700 ఎంఎం డయా మీటర్ కలిగిన నీటి పైప్‌లైన్ మార్చాల్సివుంది. ఈ క్రమంలో సూరారం ప్రధాన రహదారిపై ఆయా పనులు చేపట్టనున్నారు అధికారులు.
ALSO READ: హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత