Big Stories

Bandi Sanjay Comments: సంజయ్ కామెంట్స్.. ఫలితాల తర్వాత కేసీఆర్?

BJP Leader Bandi Sanjay Comments on KCR and BRS Party: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఫలితాలను చూసి తట్టుకునే శక్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాత్రి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కాయని ఆరోపించారు.

- Advertisement -

అంతేకాదు బీజేపీ, మోదీపైనా విషం చిమ్మి ప్రజలను భయాందోళనకు గురి చేశాయన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్ని సీట్లు గెలుచుకుంటామనేది మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఫలానా సీట్లలో తాము గెలుస్తామని బలంగా చెప్పలేకపోతున్నారు. అధికార కాంగ్రెస్ మాత్రం ఓపెన్ గా చెప్పేసింది. తాము కచ్చితంగా 13 సీట్లు గెలుచుకుంటామని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. నెక్ టు నెక్ ఎక్కడున్నదీ కూడా వివరించారు.

- Advertisement -

ఎన్నికల ఫలితాలపై మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కమలనాధులకు రుచించడం లేదు. ఫలానా సీట్లు గెలుస్తామని చెప్పులేకపోతున్నారు. మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాత్రం తాము 12 స్థానాలను గెలుచుకోవడం ఖాయమన్నారు. కాకపోతే ఈ స్థానాలన్నది ఆయన క్లారిటీ ఇవ్వలేకపోయారు. విచిత్రం ఏంటంటే.. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం తెలంగాణలో పెరిగింది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో కంపేర్ చేస్తే కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.

Also Read: పాలనపైనే దృష్టంతా.. 13 ఎంపీ సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు ఓట్ల లెక్కింపుకు 20 రోజులు ఉండడంతో స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఎన్నికల అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టదిట్టమైన భద్రత కల్పించారు. అంతేకాదు సీసీకెమెరాలతో నిఘా కూడా పెట్టారు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పర్యవేక్షణ బాధ్యతలను పోలీసు అధికారులకు విడతల వారీగా అప్పగించనున్నారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలు ఎలాగ ఉంటాయోనన్న టెన్షన్ రాజకీయ నాయకుల్లో మొదలైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News