BigTV English

Blade Found in Biryani: వామ్మో.. బయట బిర్యానీ తింటున్నారా..?బీ కేర్‌ఫుల్‌!

Blade Found in Biryani: వామ్మో.. బయట బిర్యానీ తింటున్నారా..?బీ కేర్‌ఫుల్‌!

Blade Found in Biryani: మీరు బిర్యానీ ప్రియులా? బిర్యానీ అంటే పడి చచ్చిపోతారా? జాగ్రత్త. బయట తింటే నిజంగానే చచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. బిర్యానీలో రావాల్సింది లెగ్‌ పీస్‌. కానీ వచ్చింది బ్లేడ్‌. ఎస్ మీరు విన్నది నిజమే. దమ్‌ బిర్యానీలో బ్లేడ్‌ కనిపించడంతో కస్టమర్‌ కంగుతిన్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ అండ్‌ రెస్టారెంట్ లో ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ప్రశ్నించిన కస్టమర్‌కు మేనేజ్‌మెంట్‌ నిర్లక్ష్యపు సమాధానం చెప్పింది. దాంతో కస్టమర్‌ పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు.


బిర్యానీలో బొద్దింక..
ఇదెక్కడో తెలుసా.. హైదరాబాద్‌లోని కాస్ట్‌లీ ఏరియా బంజారాహిల్స్‌లో..
బంజారాహిల్స్‌ వాళ్లే బొద్దింక వేయగా.. మేమేం తక్కువా అన్నట్టు మరో హోటల్‌ కూడా బొద్దింక బిర్యానీ వండి పెట్టింది. ఇది ఎక్కడో తెలుసా.. దిల్‌సుఖ్ నగర్ పక్కన కొత్తపేటలో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆ ఏరియా, ఈ ఏరియా అని లేదు. ఓల్డ్‌సిటీ సహా హైదరాబాద్ మొత్తం ఇదే. ఒక దగ్గర బొద్దింక కనిపిస్తే.. మరోచోట బల్లో, జెర్రినో కనిపిస్తున్నాయి. కుళ్లిన చికెన్‌ పీసుల సంగతి చెప్పనక్కర్లేదు. దేశమంతా గ్రాండ్‌గా చెప్పుకునే హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఇదేం గ్రహణం. ఇదే దౌర్భాగ్యం అనే పరిస్థితి దాపురించింది. బిర్యానీ అడిగిన కస్టమర్లకు పిచ్చెక్కిస్తున్నాయి రెస్టారెంట్లు.

హైదరాబాద్ బిర్యానీకే పలు హోటల్స్ ధమ్కి ఇస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చ ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, క్రీడాకారులు, సీని, బడా వ్యాపారవేత్తలు వచ్చి హైదరాబాద్ బిర్యానీని కుమ్మేస్తారు. ఆ రేంజ్ లో టెస్ట్ ఉంటది కాబట్టే హైదరాబాద్ బిర్యానీకి ఫీదా అవుతుంటారు కస్టమర్లు. అలాంటిది ఇటివల వరుసగా పలు బిర్యానీ హోటల్స్ లో నిర్లక్ష్యం కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా జెర్రిలు, బొద్దింకలు, పురుగులు, సిగరెట్ పీక లాంటివి బిర్యానీలో దర్శనమిచ్చాయి. అయితే తాజాగా బిర్యానీ తిందామని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ అండ్‌ రెస్టారెంట్ లో వెళ్తే.. మరో ఘటన చోటుచేసుకుంది.


Also Read:  బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రాజాసింగ్ ఖాయమేనా..?

ఆదర్శ్ బార్ అండ్‌ రెస్టారెంట్ కు వచ్చిన ఓ కస్టమర్‌కు బిక్ షాక్ తగిలింది. తాను అర్డర్ చేసుకున్న బిర్యానీలో ఏకంగా బ్లేడ్ ప్రత్యక్షమైంది. అది కూడా బిర్యానీ తింటుండగా కనిపించే సరికి కస్టమర్ కు దిమ్మ తిరిగింది. ఇదే విషయంపై కస్టమర్ రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. అది ఎలా వచ్చిందో మాకు తెలీదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే హైదరాబాద్ లోని హోటళ్లపై GHMC, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని రెయిడ్స్ నిర్వహించినా.. కొన్ని హోటల్స్ బుద్ధి మాత్రం మారడం లేదు. దీంతో వరుస ఘటనలపై నెటిజన్లు, నగరవాసులు ఫైరవుతున్నారు. ఇక మీరు మారరా? నిర్లక్ష్యంగానే ఉంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఘటనలు జరగడం, రీపిట్ అవ్వడం కామాన్ అవుతున్నాయి తప్పా.. సరైనా యాక్షన్ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు మత్తు వదిలి.. హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×