BigTV English

Fadnavis Shinde Ministry: షిండేకు మొండి చేయి.. ఫడ్నవీస్ వద్దనే హోం శాఖ.. పవార్‌కు ఆర్థికం

Fadnavis Shinde Ministry: షిండేకు మొండి చేయి.. ఫడ్నవీస్ వద్దనే హోం శాఖ.. పవార్‌కు ఆర్థికం

Fadnavis Shinde Ministry| దేశంలోని రాష్ట్రాలన్నీ ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపుగా అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. స్వపక్షంలో కూడా విపక్షంగా ఉంటుంది మహారాష్ట్ర వ్యవహారం. నవంబర్ లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బిజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సాధించింది. కానీ ప్రమాణ స్వీకారానికి ముందు కూటమిలోనే చాలా రాజకీయం జరిగింది. చాలా రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కీలక మంత్రిత్వశాఖలు తనకే కావాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.


ప్రమాణ స్వీకారం జరిగినా కేబినెట్ పదవులపై ఇంతకాలం పట్టువిడుపులు జరిగాయి. తాజాతా శనివారం డిసెంబర్ 21, 2024న మంత్రిత్వ శాఖలు కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపుల్లో ఏక్ నాథ్ షిండే డిమాండ్ చేసిన హోం శాఖ దక్కలేదు. దానికి బదులు అర్బన్ డెవలప్మెంట్ (పట్టణాభివృద్ధి) శాఖ, హౌసింగ్, పబ్లిక్ వర్క్స్ శాఖలు దక్కాయి. కీలక హోం శాఖ మాత్రం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన వద్దనే పెట్టుకున్నారు. మరో వైపు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎక్సైజ్ శాఖలు అందుకున్నారు.

మొత్తంగా చూస్తే.. కీలక శాఖలైన హోం మంత్రిత్వశాఖ, ఎనర్జీ, లా అండ్ జుడిషియరీ, జెనెరల్ అడ్మినిష్ట్రేషన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పోర్ట్ ఫోలియోలో ఉన్నాయి.


ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ లో మొత్తం 42 శాఖల కేటాయింపులు జరిగాయి. నిబంధనల ప్రకారం.. 43 శాఖలకు ఆస్కారం ఉంది. ఈ కేటాయింపులతో ఏక్ నాథ్ షిండే వర్గం అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి గిరీష మహాజన్ స్పందించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ , ఇద్దరు ఉపముఖ్యమంత్రుల మధ్య అన్ని అంశాలపై అంగీకారం కుదిరిందని.. ఇక అసంతృప్తులు లేవని తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమికి ఎన్నికల్లో 230 సీట్లు దక్కాయి. ప్రతిపక్షం ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమికి 46 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో డిసెంబర్ 5 ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 15న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

దీంతో ప్రతిపక్ష కూటమిలోని ఉద్ధవ్ శివసేన పార్టీ.. అసెంబ్లీ సమావేశాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా నిర్వహించారని ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కారం చేయకుండా, మంత్రులకు శాఖలు కేటాయించకుండా జాప్యం చేసి.. అసెంబ్లీ సమావేశాలు నామమాత్రంగా నిర్వహించారని ఉద్ధవ్ శివసేన పార్టీ నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. అర్హత లేకుండా కేవలం బోనస్ గా శాఖల కేటాయింపుల జరిగాయని ఎద్దేవా చేశారు.

“మంత్రులందరికీ బంగళాలు, కార్లు దక్కాయి. కానీ బాధ్యతలు మాత్రం లేవు. ఇదంతా వారికి హాస్యస్పదంగా ఉంది. ఎవరూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కనిపించడం లేదు” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.

బిజేపీ నాయకులకు మంత్రిత్వశాఖలు
చంద్రశేఖర్ బవాన్ కులే (రెవెన్యూ), రాధాకృష్ణ విఖే పాటిల్ (నీటి వనరులు- కృష్ణా, గోదావరి వ్యాలీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), చంద్రకాంత్ పాటిల్ (ఉన్నత, సాంకేతిక విద్య, పార్లమెంటరీ వ్యవహారాలు), గిరీష్ మహాజన్ (నీటి వనరులు- విదర్భ, తాపీ, కొంకణ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విపత్తు నిర్వహణ).

గణేష్ నాయక్‌కు అడవులు, మంగళ్ ప్రభాత్ లోధా (నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యవస్థాపకత, ఇన్నోవేషన్), జయకుమార్ రావల్ (మార్కెటింగ్, ప్రోటోకాల్), పంకజా ముండే (ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, యానిమల్ హస్బెండరీ); అతుల్ సేవ్ (OBC సంక్షేమం, డెయిరీ అభివృద్ధి మరియు పునరుత్పాదక ఇంధనం).

అశోక్ ఉయికేకు గిరిజన అభివృద్ధి, ఆశిష్ షెలార్ కు సాంస్కృతిక వ్యవహారాలు, సమాచార సాంకేతికత, శివేంద్రసింగ్ భోసలే పబ్లిక్ వర్క్స్ ఇచ్చారు. జయకుమార్ గోర్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, సంజయ్ సావ్కరే కు టెక్స్‌టైల్స్, నితేష్ రాణే ఫిషరీస్ అండ్ పోర్ట్స్, ఆకాష్ ఫండ్కర్ లేబర్ దక్కాయి.

శివసేన మంత్రుల శాఖలు:
గులాబ్రావ్ పాటిల్ నీటి సరఫరా మరియు పారిశుధ్యం, దాదాజీ భూసే పాఠశాల విద్య, సంజయ్ రాథోడ్ నేల మరియు నీటి సంరక్షణ, ఉదయ్ సామంత్ పరిశ్రమలు మరియు మరాఠీ భాష, శంభురాజ్ దేశాయ్ టూరిజం, మైనింగ్, మాజీ సైనికుల సంక్షేమం, సంజయ్ శిర్సత్ సామాజిక న్యాయం, ప్రతాప్ సర్నాయక్ రవాణా, భారత్ గొగవాలే ఉపాధి హామీ, హార్టికల్చర్, సాల్ట్ పాన్ ల్యాండ్స్ డెవలప్‌మెంట్; ప్రకాష్ అబిత్కర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.

NCP మంత్రుల పోర్ట్‌ఫోలియోలు:
హసన్ ముష్రిఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ధనంజయ్ ముండే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, దత్తాత్రే భర్నే స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ డెవలప్‌మెంట్ మరియు ఔకాఫ్, అదితి తత్కరే మహిళా మరియు శిశు అభివృద్ధి, మానిక్‌రావ్ కోకటే అగ్రికల్చర్.

నరహరి జిర్వాల్‌కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ప్రత్యేక సహాయం అందించారు. మకరంద్ పాటిల్‌కు రిలీఫ్ మరియు పునరావాసం ఇవ్వబడింది, బాబాసాహెబ్ పాటిల్‌కు సహకారం కేటాయించబడింది.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×